నటి నయనతార ఇప్పుడు అంత సులభంగా సినిమాలను ఒప్పుకోవడం లేదు. అందరు నటీనటులలాగా కథలు వింటున్నా నయనతార మాత్రం చాలా జాగర్తలు తీసుకుంటున్నారు. ఎవరు తన వద్దకు వచ్చి కథలు చెప్తున్నా ఆమె ఎంతో ఓర్పుతో వారు చెప్పేదంతా వింటున్నారు. ఆ కథ తనను ఆకట్టుకున్నా వెంటనే ఓకే తాను నటిస్తానని చెప్పడం లేదు. ఒకటి రెండు రోజులు తర్వాత చెప్తానని పంపించేస్తున్నారు. నిర్మాత తియ్యబోయే చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో తెలుసుకుని ఆ దర్శకుడు గతంలో తీసిన చిత్రాల డీ వీ డీ లు తెప్పించుకుని వాటిని దీక్షగా చూసి అ తర్వాతే నటించేందుకు అంగీకరిస్తున్నారట. ఇదేదో బాగానే ఉందిగా.