కండక్టర్ పాత్రలో...

సుమంత్ అశ్విన్ కండక్టర్ గా నటించిన చిత్రం రైట్ రైట్. ఈ చిత్రానికి దర్శకుడు మను. దర్శకుడిగా మనుకిదే తొలి చిత్రం.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ రైట్ రైట్ చిత్రానికి మూలం ఓ మలయాళం చిత్రమని, మలయాళంలో ఈ చిత్రం పేరు ఆర్డినరీ అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొన్ని సన్నివేశాలు కలిపామని, అలాగే కొన్ని సన్నివేశాలు తీసేసామని ఆయన అన్నారు. ఈ చిత్రంలో బస్సు కీలక పాత్ర ఉందని, తెర మీద బస్సు కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో చూస్తారని చెప్పారు. బాహుబలి ఫేం ప్రభాకర్ ప్రధాన పోషిస్తున్నారని, ఆయన పాత్ర పాసిటివ్ గా ఉంటుందని తెలిపారు సుమంత్.

రైట్ రైట్ చిత్రం షూటింగ్ నెల రోజులు సాగిన తర్వాత తానూ, ప్రభాకర్ ఒక రోజు విశ్రాంతి తీసుకుని అప్పటి వరకు జరిగిన చిత్రీకరణపై చర్చించుకున్నామని ఆయన చెప్పారు. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేముందు తామిద్దరం ఎలా నటించాలో మాట్లాడుకుని రిహార్సల్ చేసి చూసుకునే వారమని అన్నారు.

షూటింగ్ అంతా అయిన తర్వాత ఎడిటింగ్ రూంలో చిత్రాన్ని చూశానని, ఎంతో తృఫ్తిగా ఉందని అంటూ మొదట్లో ఉత్తర భారతంలో షూట్ చేయాలనుకున్నామని, కానీ అరకులోనే షూటింగ్ కి నిర్ణయించుకుని అందుకు తగినట్టే చిత్రీకరణ సాగించామని అశ్విన్ సుమంత్ చెప్పారు. తన తండ్రి ఎం ఎస్ రాజు గారి గురించి మాటాడుతూ తాను ఎప్పుడూ ఆయన సలహా తీసుకునేవాడినని తెలిపారు. ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆ చిత్రం కథ వింటానని, అది నచ్చితే తండ్రితో షేర్ చేసుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఆయన తమ సలహాలు, సూచనలు చేస్తారని అన్నారు. ఇంటి దగ్గర కూడా తాము ఎప్పుడూ ఫిల్మ్స్ గురించే మాట్లాడుకుంటామని చెప్పారు. తెలుగు సినిమా విడుదల అయినప్పుడు ఇద్దరం కలిసి ఆ సినిమా చూసి దాని గురించి చర్చించుకుంటామని అన్నారు. అంతే తప్ప తమ మధ్య మరే విషయాలూ చర్చకు రావని తెలిపారు. ఆయన ఏదైనా చెప్తే దానికో “నో” చెప్పానని అన్నారు. తాను నటించి పెద్దగా రాణించని “చక్కిలిగింత” చిత్రంలో సెకండ్ హాఫ్ మా నాన్నకు అంతగా నచ్చలేదని సుమంత్ తెలిపారు.

ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా సుమంత్ కండక్టర్ యూనిఫాం లోనే వెళ్తున్నారు. రైట్ రైట్ చిత్రం విడుదల అయ్యే వరకు తాను ఈ డ్రెస్ లోనే కనిపిస్తానని అశ్విన్ సుమంత్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.