కబీర్ సింగ్ బిజీ బిజీ

జిల్ సినిమాతో టాలీవుడ్ కి కొత్త విలన్ గా పరిచయమైన కబీర్ సింగ్ ఇపుడు పది సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి త్వరలో రాబోయే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డిక్టేటర్ చిత్రం. ఈ చిత్రంతోపాటు కబీర్ సింగ్ బెల్లంకొండ శ్రీనివాస్, పవన్ కళ్యాన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాలతోపాటు అజిత్ నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా కబీర్ మాట్లాడుతూ దర్శకుడు రాధాకృష్ణకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. జిల్ చిత్రంలో దర్శకుడు రాధాకృష్ణ తనకిచ్చిన విలన్ పాత్ర బాగా పండిందని అన్నారు.

కబీర్ సింగ్ హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన వారు. ఆయన సినిమాలోకి రాక ముందు కొంత కాలం మోడల్ గా ఉన్నారు. పవం కళ్యాన్ సినిమా కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను అని ఆయన అన్నారు. అలాగే తమిళ్ చిత్రంలోనూ తనకు అవకాశం రావడం తన అదృష్టమని చెప్తూ ఆ చిత్ర కథానాయకుడు అజిత్ అద్భుత నటుడని పొగిడారు. అజిత్ గొప్ప నటుడైనా అందరితోను ఎంతో హాయిగా మాట్లాడుతూ చాలా సింపుల్ గా ఉంటారని అన్నారు. అజిత్ తనకు గురువులాంటి వారని, ఆయన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని అన్నారు. అభిమానుల ఫాలోయింగ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ కన్నా అజిత్ కు ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు.

టాలీవుడ్ లో పవన్ కళ్యాన్ గురించి ఎన్నో మంచి విషయాలు తాను విన్నానని, ఆయనతో నటించడం తన అదృష్టమని కబీర్ చెప్పారు. ఆయనను త్వరలోనే కలిసి ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉందని తెలిపారు.

గొప్ప ప్రాజెక్టులే కాకుండా గొప్ప గొప్ప హీరోలతో కలిసి నటించే అవకాశ రావడం ఆనందంగా ఉందని చెబుతూ తన తల్లిదండ్రులు ఇప్పటికీ ఫరీదాబాద్ లోనే ఉన్నారని, తాను నటించిన తెలుగు సినిమా చూసి తల్లిదండ్రులు తనను దీవించారని అన్నారు. వాళ్ళు ఫోన్ చేసి తనతో మాట్లాడుతుంటే వారి మాటల్లో ఆనందం ఫీలయ్యానని చెప్పారు.

టాలీవుడ్ లో రొటీన్ విలన్ లా కాకుండా భిన్నమైన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందాలని అనుకుంటున్నానని కబీర్ అన్నారు. అందుకేనేమో తనకు ఇన్ని ఆఫర్లు వచ్చినట్టు చెప్పుకున్నారు. మరిన్ని ఆఫర్లు వచ్చినా డేట్ల సమస్య తో పెండింగ్ లో ఉంచానని, హైదరాబాద్ లో ఉండటం తనకెంతో ఇష్టమని, జిల్ చిత్రం తర్వాత తాను దాదాపు ఆరు నెలలుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాను అని కబీర్ సింగ్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.