కష్టాల్లో శ్రీను వైట్ల

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల చిక్కుల్లో పడ్డారు. అంతకు ముందు ఆగడు, ఇప్పుడు బ్రూస్లీ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కు తలనొప్పి మొదలైంది.

శ్రీను వైట్ల మీద రచయిత కోన వెంకట్ ఘర్షణకు దిగారు.

రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్రూస్లీ చిత్రానికి కోన వెంకట్ రచయితగా స్క్రీన్ మీద పేరైతే వేసారు గానీ తన కథ వాడలేదని కోన వెంకట్ గుర్రుగా ఉన్నారు. తాను ఇచ్చిన అసలు స్క్రిప్ట్ ని వాడలేదని, కథ మొత్తం మార్చేసేరని వెంకట్ చెప్పారు. కనుక శ్రీను వైట్ల మీద పది కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేయాలన్న ఆలోచనలో కోన వెంకట్ ఉన్నారు. అలాగే తాను ఇచ్చిన కథను మార్చేసినందుకు పబ్లిక్ గా శ్రీను వైట్ల క్షమాపణ చెప్పాలని కూడా కోన వెంకట్ డిమాండ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అతి దారుణంగా ఫ్లాప్ అయిన వాటిలో బ్రూస్లీ ఒకటి. అరవై కోట్ల రూపాయలు దాటిన బ్రూస్లీ సినిమా ఆడకపోవడంతో ఆ డబ్బు రాబట్టుకోవడం కష్టమైంది.

టాలీవుడ్ పరిశ్రమలో ఒక రచయిత దర్శకుడి పై దావావేయాలనుకోవడం అరుదు. పైగా పేరు మాత్రం వాడుకుని స్క్రిప్ట్ వాడకపోవడం విషయంలో కోపం వచ్చి రచయిత గొడవకు దిగడం కూడా అరుదే.

తన పేరు గానీ స్క్రీన్ మీద చూపక పోయి ఉంటే తాను సంతోషించి ఉండేవాడినని చెప్తూ ఆన్ లైన్ లో తన అసలు కథ అప్లోడ్ చేస్తే బాగుంటుందని వెంకట్ అభిప్రాయపడ్డారు. అలా చేయడం వల్ల తాను ఇచ్చిన కథ ఏమిటో, సినిమాలో నడిపించిన కథ ఏమిటో అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు.

ఇలా ఉండగా నిర్మాత డీ వీ వీ దానయ్య కూడా రచయిత వైపే ఉన్నట్టు తెలుస్తోంది.

ఎందుకంటే దానయ్యకు కూడా వెంకట్ నుంచి ఒరిజినల్ స్క్రిప్ట్ అందినట్టు చెప్పారు.

మరోవైపు, శ్రీను వైట్ల పై ఇప్పటికే తనను వేధిస్తున్నాడని ఆయన భార్య రూప దావా వేసి ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. కొందరు పెద్ద మనుషుల జోక్యంతో ఆమె విత్ డ్రా చేసుకున్నట్టు తెలిసింది. దాంతో పోలీసులు కూడా ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టలేదు. కౌన్సిలింగ్ కి శ్రీను వైట్ల దంపతులు ఒప్పుకున్నందు వల్ల గొడవ పెద్దదవలేదని తెలిసింది.

Send a Comment

Your email address will not be published.