కాజల్ కు బోరు కొడుతోందట...

నటి కాజల్ కి డ్రీం రోల్ అని ప్రత్యేకంగా ఏదీ లేదట. కాజల్ ని ఏ పాత్రలో నటించమన్నా బాగా చేస్తుందన్న మాటే చాలు తప్ప ఫలానా రోల్ మాత్రమే బాగా చేస్తుందనే ముద్ర వేయించుకోవడం ఆమెకు ఇష్టం లేదట . ఏ రోల్ వేసిన అందులో అమోఘంగా గొప్పగా నటిస్తుంది అని చెప్పించుకోవడం ముఖ్యమని కాజల్ అభిప్రాయం. అన్ని విధాలైన క్యారక్టర్లను వెయ్యగలగడమే ఒక నటికి అవసరం అని చెప్పిన కాజల్ కు రొమాంటిక్ కామెడీ పాత్ర పోషించడం మహా ఇష్టమట. అలాగని ఒకే పాత్రకు పరిమితమైపోతే బోరు కొడుతుందని చెప్పారు. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలు వెయ్యడం ఎవరికైనా ప్రధానమని ఆమె అన్నారు.

ఆమె ఫేవరిట్ హీరో రజనీకాంత్. ఫేవరిట్ హీరోయిన్ శ్రీదేవి. వీరిద్దరంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ఎందరో నూతన నటీనటులు వచ్చారు, వస్తున్నారు….వారిలో నా చెల్లెలు నిషా అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆమెలో ఒక చిన్నారిలాంటి చిలిపితనం ఉంది. అది నాకెంతో ఇష్టం అని కాజల్ చెప్పారు. ఆమె మంచి నటి. కానీ ఆమెకు అంతలోనే పెళ్ళైపోయిందని, ఆమెను మిస్ అవుతున్నానని, ఉన్న తారల్లో నాకు నిత్య మేనన్ నచ్చుతుందని తెలిపారు.

సినీ రంగంలో అందరితో మాట్లాడే కాజల్ తనకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ సినీ రంగంలో లేరన్నారు. ఆమెకు అందరూ ముంబై ఫ్రెండ్స్ మాత్రమేనట.

బాలీవుడ్ లో నటించిన రెండు సినిమాలు బాగా ఆడాయని, పాపులారిటీ కూడా సంపాదించానని ఆమె అన్నారు. కానీ ఆమెకు బాలీవుడ్ కన్నా తెలుగు, తమిళ సినిమాల్లో చెయ్యడమే ఇష్టమట. ఈ రెండు భాషా చిత్రాలకే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట.

ఆమెకు సంబంధించినంత వరకు స్క్రిప్ట్ ముఖ్యమట.
భాష, హీరో వంటి అంశాలన్నీ ఆ తర్వాతేనట.
స్క్రిప్ట్ బాగుంటే కదా సినిమా బాగుండేదని కాజల్ అభిప్రాయం.

Send a Comment

Your email address will not be published.