కాజల్ తప్పుకుంటుందా?

జూనియర్ ఎన్టీఆర్ – కాజల్ ముచ్చటగా మూడవసారి కలిసినటిస్తారని అందరూ ఆశించారు. కానీ అది సెట్స్ వరకూ వెళ్ళడం అనుమానమేనని చిత్రపరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

గతంలో వీరిద్దరూ కలిసినటించిన బృందావనం, బాద్ షా చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయాన్నే సాధించాయి. సక్సెస్ జంట అంటూ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకు ఎక్కించనున్న ఓ చిత్రం కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ నాయికగా కాజల్ ను ఎంపిక చేసారు. ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది కూడా.

అయితే ఎన్టీఆర్ సినిమా కోసం కేటాయించిన తేదీలు సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని కాజల్ అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ సినిమా కన్నా ముందే ఆమె తమిళంలో ఒక సినిమా, బాలీవుడ్ లో రెండు సినిమాలకు అంగీకరించింది. ఆ మూడు సినిమాలు ఒకేసారి సెట్స్ కి వెళ్లనున్నాయట. పైగా పూరీ జగన్నాథ్ కూడా ఎక్కువ డేట్స్ అడగటంతో సర్దుబాటు కష్టమని కాజల్ భావించి పూరీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం సాగుతోంది.

Send a Comment

Your email address will not be published.