కాథరీన్ ఔట్!

catherineరాం చరణ్ నిర్మిస్తున్న చిరంజీవి 150 వ చిత్రం నుంచి కాథరీన్ ట్రెసాను పక్కకు తప్పించాల్సి వచ్చింది. ఈ చిత్రంలో కాథరీన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించాల్సి ఉంది. అయితే ఆమెకు బదులు రాయ్ లక్ష్మిని ఎన్నుకోవలసి వచ్చింది…

అందుకు కారణం…
ఆమెకు, ఈ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ కొణిదెల సుష్మిత మధ్య నెలకొన్న కొన్ని అభిప్రాయాల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. కాస్ట్యూమ్ విషయంలో కాథరీన్ సుష్మితతో వాదనకు దిగినట్టు అభిజ్ఞ వర్గాల భోగట్టా. పైగా కాథరీన్ అతి నిర్లక్ష్యంగా మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయంతో కోపగించుకున్న సుష్మిత తన తండ్రి చిరంజీవి దృష్టికి తీసుకుపోయింది. అలాగే సోదరుడు రాం చరణ్ తోనూ ఈ వ్యవహారం గురించి మాట్లాడింది. దీనితో కాథరీన్ ని ఈ చిత్రం నుంచి తప్పించినట్టు తెలిసింది. ఇదంతా అనధికార సమాచారమే తప్ప అసలు విషయాలను రాం చరణ్ మేనేజర్ చెప్పలేదు కానీ కాథరీన్ బదులు స్పెషల్ సాంగ్ కోసం రాయ్ లక్ష్మికి అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు.
ఇలాఉండగా కాథరీన్ కొత్త నటి ఏమీ కాదు. చలనచిత్ర పరిశ్రమలో సుపరిచితురాలే. సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ తదితరులతో నటించిన తారే కాథరీన్.

మరోవైపు రాయ్ లక్ష్మి కూడా సామాన్యురాలు కాదు. పరిచయస్థురాలే. పవన్ కళ్యాన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో రాయ్ లక్ష్మి ఓ ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే కదా!

Send a Comment

Your email address will not be published.