కార్తికేయ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. నిఖిల్, స్వాతి జంటగా నటించిన చిత్రం.
స్వామిరారా చిత్రంతో రాణించిన ఈ జంట ఇప్పుడు మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదనిపించుకున్నారు.
ఓ ఊళ్ళో ఓ ఆలయం. అది మూసే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆ ఆలయం గురించి మాట్లాడితే ఆ మాట్లాడిన వాళ్ళు బతికి ఉండరు. ఈ క్రమంలో ఎందుకు అలా జరుగుతోంది? ప్రాణాలు పోవడమేమిటి ? అని తెలుసుకోవడానికి కథానాయకుడు నిఖిల్ రంగంలో దిగిన తర్వాత చోటు చేసుకున్న మలుపులను ప్రేక్షకులు తెరపై చూస్తారు. అసలు సినిమా ప్రారంభంలోనే చూపించిన సన్నివేశం బట్టి కార్తికేయలో ఏదో ఒక ఆసక్తికరమైన కథనం ఉంటుంది అనే అభిప్రాయం కలిగించారు దర్శకులు చందు ముందేటి. కథ, స్క్రీన్ ప్లే కూడా చందునే సమకూర్చారు. ఈ చిత్రంలో ప్రేమ, కామెడి సన్నివేశాలు కూడా ఉన్నాయి. పాముల హిప్నాటిజం అంశాలు పరవాలేదు.
నిఖిల్ తన వంతు పాత్రను బాగానే పోషించాడు. రావు రమేష్, తనికెళ్ళ భరణి పాత్రలు కూడా ప్రధానమైనవిగా చెప్పుకోవాల్సిందే.
సంగీతం శేఖర్ చంద్ర అందించారు. నిర్మాత బొగ్గరం వెంకట శ్రీనివాస్