కాలక్షేపానికి “రారండోయ్....”

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “రారండోయ్ వేడుక చూద్దాం”.
అక్కినేని నాగార్జున అన్నపూర్ణా స్టూడియోస్ పై నిర్మించిన ఈ చిత్రంలో నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్, చలపతిరావు, తదితరులు నటించారు.

భ్రమరాంబ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఓ కుటుంబంలో ఎంతో గారాబంగా పెరుగుతుంది. కూతురంటే తండ్రికి పంచప్రాణాలు. తండ్రిగా నటించిన సంపత్ పాత్ర పేరు ఆది. కూతురు కోసం ఏది చేయాలన్నా వెనుకాడడు. ఒకానొక పెళ్లిలో శివ పాత్రలో నటించిన నాగచైతన్య భ్రమరాంబను ప్రేమిస్తాడు. శివ ఉంటున్న విశాఖపట్నానికి భ్రమరాంబ చదువుకోవడానికి వస్తుంది. ఈ క్రమంలో ఆమె శివకు దగ్గరవుతుంది. వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఈ ఇద్దరు తండ్రుల మధ్య చాలాకాలంగా శత్రుత్వం ఉంటుంది. దానితో ఈ పెళ్ళికి ఒప్పుకోరు. ఇంతకూ వారి మధ్య ఉన్న శత్రుత్వం ఏమిటి? శివ – భ్రమరాంబ మధ్య పుట్టిన ప్రేమ ఏమైంది? వాళ్ళిద్దరూ ఏకమయ్యేరా లేదా వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాలి.
నాగచైతన్య – రకుల్ జంట చూడటానికి చాలా బాగుంది. ఓ కొంటె కుర్రాడిగా నాగచైతన్య నటన బాగా పండింది. రాకుల్ కూడా బాగా నటించింది.
ఇతర పాత్రల్లో జగపతి బాబు, సంపత్, వెన్నెల కిషోర్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఈ చిత్రంలో కధనాన్ని నడిపించడంలో దర్శకుడు అంతగా విజయం సాధించలేకపోయాడు.
దేవిశ్రీ ప్రసాద్ స్వరాలలో రూపొందిన పాటలు వినడానికి పరవాలేదు.
హాస్యం అంత బాగులేదు.

ప్రధమార్థంలో రాణించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త సాగాదీసాడా అనిపిస్తుంది.
మొత్తంమీద కుటుంబ పరంగా చూడదగ్గ చిత్రమే ఇది.

Send a Comment

Your email address will not be published.