కాస్ట్యూమ్స్ అదరాయి!

ఎప్పుడెప్పుడా అనుకున్న బాహుబలి విడుదలై మూడు వారాలు దాటింది. చూసిన వాళ్ళల్లో చాలామని బాహుబలి మొదటిపార్తులో టెక్నికల్ అంశాలను, యుద్ధ ఘట్టాలను తెగ పొగుడుతున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంకెవ్వరూ తియ్యలేరన్న రీతిలో దర్శకులు రాజమౌళి ప్రేక్షకుల ముందు ఉంచారని చెప్పుకుంటున్నారు. అయితే కథ విషయం వచ్చేసరికి చాలామందిలో కాస్త అసంతృప్తి లేకపోలేదు. కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్టులకు సంబంధించి మాత్రం మన దేశంలో ఇంకెవ్వరూ ఊహించలేని స్థాయిలో బాహుబలి అగ్రస్థానంలో ఉన్నట్టు చెప్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం రాజమౌళి ప్రతిభను తెగ మెచ్చుకుంటున్నారు. అయితే మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ‘రుద్రమదేవి’

రుద్రమదేవి చిత్రం కూడా ఉన్నతమైన సాంకేతికతతో రూపుదిద్దుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో రుద్రమదేవి చిత్రం కూడా బాహుబలికి తీసిపోదు అనే టాక్ ఇప్పటికే వినవస్తోంది. కానీ ఆర్ధికపరంగా బాహుబలి కున్న పట్టు గుణశేఖర్ (రుద్రమదేవి) కు లేదు కనుక ఎక్కడైనా కాస్త ఓ మెట్టు కింద ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఒకటి రెండు విషయాల్లో రుద్రమదేవి బాహుబలిని అధిగమించవచ్చనే అభిప్రాయం వెల్లడైంది. ముఖ్యంగా కాస్ట్యూమ్ విషయంలో రుద్రమదేవి అనుకుంటున్నారు.

‘రుద్రమదేవి’ ప్రధాన పాత్రధారుల గెటప్పులు కొన్నింటిని ఈ మధ్య విడుదల చేసినప్పుడు కాస్ట్యూమ్ విభాగంలో బాహుబలిని ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి చెప్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా రుద్రమదేవి సినిమాకు పని చేశారు. నీతా ప్రొఫెషనల్ పరంగా ఓ మెట్టు ఎక్కువలో ఉండటం వల్ల కాస్ట్యూమ్స్ విషయంలో ఏదో ఒక ప్రత్యేకతను చూడవచ్చనే ఆశాభావం వెల్లడవుతోంది. రుద్రమదేవి చిత్రంలో నటించిన అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్ తదితరుల గెటప్స్ చాలా రిచ్చుగా ఉన్నాయని, బాహుబలిని మించిపోవడం ఖాయమని చెప్తున్నారు.

Send a Comment

Your email address will not be published.