‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఒకే

ఇప్పటి వరకు రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఒక ఎత్తైతే ఇప్పుడు తాజాగా విడుదల అయిన చిత్రం మరో ఎత్తు. నిన్ననటించిన మొన్నటి వరకు చేసిన చిన్నవే అయినా అన్నింటా విజయాన్ని చవి చూసిన రాజ్ తరుణ్ ఇప్పుడు ఓ పెద్ద స్థాయి చిత్రంతో మన ముందుకి వచ్చినట్టే చెప్పుకోవాలి. ఆ చిత్రమే ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ .

Kittu-Unnadu-Jagrathaవంశీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తో పాటు అను ఇమ్మాన్యుయెల్, అర్బాజ్ ఖాన్, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్, నాగబాబు తదితరులు
నటించారు. స్క్రీన్ ప్లే కూడా వంశీకృష్ణదే.

ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ సమకూర్చగా శ్రీనివాస్ విస్సా కథ అందించారు. మాటలు సాయిమాధవ్ బుర్రా రాసారు.
సుంకర రామ బ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు.

కిట్టు పాత్రలో నటించిన రాజ్ తరుణ్ ఈ చిత్రం కథాపరంగా ఓ అనాథ కుర్రాడు. అతను తనలాంటి మరో ముగ్గురితో కలిసి ఓ అనాధ ఆశ్రమంలో పెరుగుతాడు. అయితే చదువు మీది పట్టుదలతో రాజ్ తరుణ్ ఇంజినీరింగ్ చదువుకుంటాడు. సొంతంగా గ్యారేజ్ నడుపుకుంటున్న రాజ్ తరుణ్ తన గ్యారేజీకి కారు మరమ్మతు కోసం తీసుకొచ్చిన ఓ అమ్మాయిపై ఇష్టం పెంచుకుంటాడు. ఆ అమ్మాయి పేరు జాను. జాను పాత్రలో ఇమ్మాన్యుయెల్ నటించింది. కానీ ఆ అమ్మాయి వల్ల అతను ఆర్ధికంగా సమస్యలకు గురవుతాడు. ఈ కష్టాల నుంచి గట్టెక్కడానికి అతను తన మిత్రులతో చేతులుకలుపుతాడు. ఈ మిత్రబృందం ఓ ప్లాన్ చేస్తుంది. అదేమిటంటే ఖరీదైన కుక్కల్ని కిడ్నాప్ చేయడం, దీనితో వచ్చే డబ్బులు గడించడం లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ జానుకి రాజ్ తరుణ్ విషయం తెలిసిపోతుంది. అతని తీరుని తప్పు పట్టి అసహ్యించుకుంటుంది. ఈ క్రమంలో జాను కాస్తా కిడ్నాప్ కు గురవుతుంది.

ఆమె వల్ల కిట్టు ఎందుకు చిక్కుల్లో పడ్డాడు, జానూని కిడ్నాప్ చేసింది ఎవరు? తన ప్రేమను కాపాడుకుని జానునీ ఎలా దక్కించుకున్నాడు వంటివన్నీ తెలియాలంటే ఈ చిత్రం చూడాలి.

కామెడీ ప్రధానంగా సాగిన ఈ కథలో మలుపులకు కొదవలేదు. అయితే కథనంలో దర్శకుడు వంశీకృష్ణ కొంత విఫలమైనట్టే చెప్పుకోవాలి. ప్రథమార్ధమేమో మలుపులతో సాగితే ద్వితీయార్ధం అంతా గజిబిజిగా సాగి ముగిసింది.
ఈ చిత్రంలో నటీనటులందరూ తమ వంతు బాధ్యతగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఎవరినీ తక్కువ చేసి చెప్పడానికి వీలు లేదు.

సంగీతం పరవాలేదు. అయినా సినిమాకు వందకు యాభై మార్కులే వేయవచ్చు.

Send a Comment

Your email address will not be published.