కుందనపు బొమ్మ

ప్రముఖ రచయిత కీర్తిశేషులు ముళ్ళపూడి వెంకట రమణ కుమారుడు ముళ్ళపూడి వర మళ్ళీ తెరమీదకు వచ్చేసారు.

కుందనపు బొమ్మ అనే సినిమా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కొమాకుల సుధాకర్, సుదీర్, చాందిని చౌదరి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాందిని తెలుగు అమ్మాయి కాగా సుధాకర్ హ్యాపీ డేస్ ఫేంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.

ముళ్ళపూడి వర గతంలో కొన్ని చిత్రాలు దర్శకత్వం వహించినా వాటికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ చిత్రాలు వాణిజ్య పరంగా రాణించలేదు.

అయితే ఇప్పుడు ఆయన దర్శకత్వంలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న కుందనపు బొమ్మ చిత్రం ఫస్ట్ లుక్ ని హైదరాబాదులో ఏప్రిల్ 25వ తేదీన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఈ చిత్రం లోగోను విడుదల చేస్తూ  ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు మాట్లాడారు.  “బాపు, రమణలు నాకు ఎంతో ఆప్తులు. ఆత్మీయులు. రమణ అబ్బాయిని జాగర్తగా చూసుకోవాలి. ఆ బాధ్యతతోనే ఈ చిత్రానికి సమర్పిస్తున్నాను. బాపు బొమ్మని తలపించే చిత్రం ఇది. సినిమా పేరు చూస్తుంటే బాపు బొమ్మ కడలి వచ్చినట్టే ఉంది” అని రాఘవేంద్ర రావు  అన్నారు.

దర్శకుడు వర మాట్లాడుతూ రాఘవేంద్ర రావు గారికి నలభై మూడు కథలు చెప్పిన తర్వాత ఈ 44వ కథ నచ్చినట్టు చెప్పారన్నారు. అప్పుడే ఈ కథ తెరకెక్కినట్టు వర చెప్పారు. ఈ కథంతా పల్లెటూరు నేపద్యంలో సాగుతుందని అన్నారు. ఇదొక కుటుంబ ప్రేమ కథా చిత్రమని వర చెప్పారు.

ఈ కార్యక్రమంలో సంగీతదర్శకులు కీరవాణి, మాటల రచయిత అనురాధ ఉమెర్జీ, గౌతం కాశ్యప్, నటీనటులు పాల్గొన్నారు.

Send a Comment

Your email address will not be published.