కుల్ఫీ ...ఆస్వాదించండి....

తమిళంలో వడకర్రీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తెలుగులో కుల్ఫీ పేరుతో విడుదలైంది. సామల శ్రీనివాస రెడ్డి సమర్పణలో ఎస్ ఎన్ ఆర్ బ్యానర్ పై నరసింహా రెడ్డి సామల తెలుగులో ఈ చిత్రాన్ని కుల్ఫీగా అందించారు.

ఈ చిత్రంలో జై, స్వాతీ ప్రధాన జంటగా నటించారు.

బాలీవుడ్ తార సన్నీ లియోన్ ఒక ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసింది. ఆమె నృత్యం సినిమాకు అదనపు ఆకర్షణ అయ్యింది. బాలన్ కూడా ఇచ్చింది.

మొత్తం 110 హాల్స్ లో ఈ సినిమా విడుదల అయ్యింది.

ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ కథ. కుర్రకారుకు కావలసిన అన్ని అంశాలూ ఇందులో ఉన్నాయి.

ఈ చిత్రం పై అన్ని ప్రాంతాల నుంచి మంచి టాక్ వచ్చినట్టు నిర్మాత ఈ సందర్భంగా చెప్పారు. ఈ చిత్రం ద్వారా పొందిన తృప్తితో తాము తెలుగులో నేరుగా ఒక సినిమాను అందించాలని అనుకుంటునట్టు ఆయన అన్నారు. ఈ చిత్రంలో ఒక ప్రముఖ హీరో నటిస్తాడని, అగ్ర దర్శకుడు దర్శకత్వం వహిస్తారని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.