కృషి చేస్తే అదృష్టం వరిస్తుంది

సినీ పరిశ్రమలో అన్నింటికీ మించింది ప్రజాదరణ అని సూపర్ స్టార్ కృష్ణ అంటూ ఉంటారు. ప్రజాదరణ ఉండి  పట్టుదలతో కృషి చేస్తే అదృష్టం వరిస్తుందని ఆయన గట్టి నమ్మకం.

ఒక నటుడు రాణించాలంటే అదృష్టంతో పాటు కృషి, పట్టుదల ఉండి తీరాలి. వాటితోపాటు ప్రజాదరణ ఉంటే ఎన్నాళ్ళైనా రాణించవచ్చు  అని ఆయన నిశ్చితాభిప్రాయం.

జనం తిట్లను తిట్లుగా తీసుకుంటే ఇబ్బంది కానీ వాటిని సద్విమర్శగా తీసుకుంటే అవి ఎంతో ఉపయోగపడతాయి అని ఆయన అన్నారు.

ఆయన నటించిన దేవదాసు చిత్రం విడుదల అయినప్పుడు సినీ పరిశ్రమలో సంచలనం. కొందరు తిట్టారు. రాళ్ళు వేస్తారు అని చెప్తే కూడా ఆయన వెనుకాడ లేదు. నిన్నటి వరకూ పొగిడిన వాళ్ళు తిడుతున్నారంటే అందులో ఏదో కారణం ఉంటుంది అని అనుకోవాలన్నారు. నిజంగానే సినిమా నచ్చక తిడుతున్నారా ద్వేషంతో తిడుతున్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే జనంలోకి వెళ్ళవలసిందే అని ఆయన అన్నారు. కనుక ఎవరైనాసరే  కేవలం పొగడ్తనే కాకుండా తిట్లనూ, విమర్శలనూ వినాలి. పొగడ్తలకు పొంగి పోకూడదు…విమర్శలకు కుంగిపోకూడదు అని ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.