కృష్ణకుమారి కన్నుమూత

KrishnaKumari

అలనాటి మేటి నటి కృష్ణకుమారి ఇక లేరు.

బెంగుళూరులో 2018 జనవరి 24వ తేదీ ఉదయం తుదిశ్వాసవిడిచారు. ఆమె వయస్సు 84 ఏళ్ళు.

1933 మార్చి ఆరవ తేదీన పశ్చిమ బెంగాల్ లోని నైహతి అనే ప్రదేశంలో ఓ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కృష్ణకుమారి తండ్రి పేరు వెంకోజి రావు. తల్లి సచీదేవి. ఆమె పెద్దక్కయ్య పేరు షావుకార్ జానకి. కృష్ణకుమారి భర్త అయిన అజయ్ మోహన్ 2012లో కన్నుమూశారు. ఆయన వ్యాపారవేత్త. ఆయన కుటుంబంవారు రాజస్థానీయులు. కృష్ణకుమారి దంపతులకు ఒకే కుమార్తె. ఆమె పేరు దీపిక. దీపిక తన తల్లి మీద ఓ పుస్తకం(టైటిల్ … మై మదర్ టీ. కృష్ణకుమారి) కూడా రాశారు. కృష్ణకుమారి అల్లుడు విక్రం మైయా. మనవడి పేరు పవన్.

నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీగణేశన్, డాక్టర్ రాజ్ కుమార్ తదితరులతో కలిసి నటించిన Krishna-Kumariకృష్ణకుమారి మొత్తంమీద 150 తెలుగు సినిమాల్లోనూ, దదాపు 30 తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. మొత్తంమీద ఈమె దాదాపు రెండు దశాబ్దాలపాటు నటించారు.

ఆమె బిజీ నటిగా ఉన్నప్పుడే నటనకు గుడ్ బై చెప్పి బెంగళూరులో స్థిరపడ్డారు. కృష్ణకుమారి తన పదహారో ఏట నటించడం మొదలుపెట్టారు.

తండ్రి ఉద్యోగారీత్యా తరచూ బదిలీలపై అటూ ఇటూ తిరుగుతుండడంతో కృష్ణకుమారి చదువు సంధ్యలు కూడా వివిధ ప్రదేశాలలో సాగాయి. ఆమె రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా తదితర ప్రాంతాలలో చదువుకున్నారు.

కృష్ణకుమారి ఓమారు తన తల్లితో కలిసి స్వప్నసుందరి అనే సినిమా చూడడానికి వెళ్ళారు. అక్కడికి సౌందర్ రాజన్ అనే ఆయన కుమార్తె భూమాదేవి కూడా వచ్చారు. ఆమె కృష్ణకుమారిని చూసిన పరిచయం చేసుకున్నారు. తాను అమాయకంగా కనిపించే ఓ కథానాయిక కోసం వెతుకుతున్నట్లు మాటల్లో చెప్పారు. అంతే, ఆ మరుసటి రోజే వాళ్ళు కృష్ణకుమారి ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వారి అనుమతితో ఓ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పించారు.

కృష్ణకుమారి తొలిసారిగా నటించిన చిత్రంపేరు నవ్వితే నవరత్నాలు. ఈ చిత్రం 1951లో వచ్చింది. అనంతరం మరో రెండేళ్ళకు ఈమె 1953లో పిచ్చిపుల్లయ్య చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అవకాశాలు ఒకటి తర్వాత ఒకటి వెతుక్కుంటూ వచ్చాయి. మంచి గుర్తింపూ లభించింది. ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు తదితర చిత్రాలలో నాటి అగ్ర్రశేణి కథానాయకులతో కలిసి నటించిన కృష్ణకుమారి అనేక

krishna kumariవైవిధ్యమైన పాత్రలలో నటించి అందరినీ మెప్పించడం విశేషం.

కృష్ణకుమారిగారికి భానుమతి అంటే తెగ ఇష్టం. అందుకే భానుమతిగారితో కలిసి నటించిన కులగోత్రాలు, పుణ్యవతి చిత్రాలనెప్పటికీ మరచిపోలేనని ఆమె అంటూ ఉండేవారు. మహానటి సావిత్రి కృష్ణకుమారిని తన సొంత సోదరిలా చూసుకునేవారు. కృష్ణకుమారి సోదరి శ్రీమతి షావుకారి జానకి.

బెంగుళూరులో కృష్ణకుమారికి అయిదు ఎదకరాల ఎస్టేటు ఉంది. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలోని అందమైన ఇంట్లో ఈమె జీవితాన్ని కొనసాగించారు.

– యామిజాల

Send a Comment

Your email address will not be published.