కె వి రెడ్డి దర్శకత్వం...

ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్న కె వి రెడ్డి మొదటిసారిగా దర్శకత్వం వహిస్తానని చెప్పినప్పుడు కొందరు ఆయన మాట విని పెదవి విరిచారు.

ప్రొడక్షన్ మేనేజర్ దర్శకుడు వహించడమా అని ఆయన మాటపై సందేహాలు వెలిబుచ్చారు.

అయితే కె వి రెడ్డి అప్పటికే తానూ సిద్ధం చేసుకున్న భక్త పోతన అనే స్క్రిప్ట్ ని చూపించారు. కానీ వాహినీ సంస్థ కాస్త వెనకడుగు వేయడం తెలిసి మూలా నారాయణస్వామి ముందుకు వచ్చి కె వి రెడ్డి ని వెన్నుతట్టారు. “వాహినీ సంస్థ తీస్తే సరి…లేకపోతే నేనే తీస్తాను…మీరు దిగులు పడకండి….” అని మూలా నారాయణ స్వామి కె వి రెడ్డితో చెప్పారు.

ఇంతలో వాహిని సంస్థ భాగస్వాములు సరేనని కూడబలుక్కుని కె వి రెడ్డికి ఒక అవకాశం ఇవ్వడానికి సమ్మతించారు. ఇలా కె వి రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన వెండితెర కెక్కింది.

కె వి రెడ్డికి ఆత్మా విశ్వాసం ఎక్కువే. మూలా  నారాయణస్వామి అప్పట్లో వాహినీ పిక్చర్స్ అధినేత. ఆయన కె వి రెడ్డిని పిలిచి “నీ మొదటి సినిమాకి వెయ్యి రూపాయలు ఇమ్మంటావా లేక సినిమా లాభాల్లో పది శాతం ఇమ్మంతావా ? అని.

కె వి రెడ్డికి తన ప్రాజెక్ట్ మీద ఎనలేని నమ్మకం. దానితో ఆయన వెయ్యి రూపాయలు కాదు గానీ లాభంలో పది శాతం వాటా కావాలని కె వి రెడ్డి అడిగారు ఏ మాత్రం ఆలోచించకుండా.

భక్తపోతన సినిమా విడుదలైంది.

గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇంకేముంది. ముందనుకున్న మాట ప్రకారం కె వి రెడ్డికి లాభాల్లో వాటా కింద పది వేల రూపాయలు లభించాయి.

భక్తపోతన తర్వాత కె వి రెడ్డి చిత్రీకరించిన సినిమా యోగి వేమన.

శ్రీ కె వి రెడ్డి గారి అమ్ములపొదిలోని అద్భుతమైన చిత్రాలు: గుణసుందరి కధ, మాయా బజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కధ, సత్య హరిశ్చంద్ర, శ్రీ కృష్ణార్జున యుద్ధం, భాగ్య చక్రం, శ్రీ కృష్ణ సత్య.

శ్రీ కె వి రెడ్డి గారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్వర్ణయుగానికి నాంది పలికారన్నది అక్షర సత్యం.

Send a Comment

Your email address will not be published.