కొంచెం ఎబ్బెట్టుగానే ఫీలవుతా!

Srideviటీవీలో నేను నటించిన పాత సినిమాలు వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తాను. కానీ నా పిల్లలూ, మా వారూ చూస్తారు. పిల్లలు ఆ సినిమాలు చూసి నాకేసి చూసినప్పుడు కాస్తంత ఇబ్బందిగా ఫీలవుతాను అని సీనియర్ నటి శ్రీదేవి చెప్పారు.

53 ఏళ్ళ శ్రీదేవి సినీ జీవితంలో ఇది యాభయ్యో సంవత్సరం. ఆమె మూడు నాలుగేళ్ళకే వెండితెరకు పరిచయమయ్యారు. “టీవీలో ఏ భాషలో నా సినిమా వచ్చినా నా భర్త ఆ సినిమాలు చూస్తారని” ఆమె అన్నారు.

దక్షిణాది చిత్రాల్లో ఒకప్పుడు బిజీ నటిగా నటించిన శ్రీదేవి ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆమధ్య ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో నటించిన శ్రీదేవి తాజాగా నటించిన “మాం” చిత్రం బాలీవుడ్ లో విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ఆమె భర్త బోనీ కపూర్ నిర్మించారు. ఈ చిత్రమే తెలుగులోనూ విడుదల అవుతుంది.

ఆమెకు 1997లో పెళ్ళయ్యింది. ఆ తర్వాతా 2012లో తిరిగి వెండితెరపై కనిపించిన శ్రీదేవికి ఆ తర్వాత దక్షిణాది నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే హిందీలో నటించాలా దక్షిణాదిలో నటించాలా అని ప్లాన్ చేసుకోలేదని అన్నారు. అయితే ఓ మంచి చిత్రంలో నటించాలి అనే ఆశ అయితే ఉందని చెప్పారు. అది ఏ భాషా చిత్రం అనేది అప్రస్తుతమని, మంచి కథతో కూడిన చిత్రం చేయడమే ముఖ్యమని చెప్పారు. ఇప్పుడు పిల్లలు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని, అందుకే ఇప్పుడు వారితోనే ఉంటున్నానని అన్నారు.

రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో ఏకంగా 24 సినిమాల్లో నటించానని , అది తన అదృష్టమని శ్రీదేవి చెప్పారు.

Send a Comment

Your email address will not be published.