కొత్తదనం లేదు

DJ movieఅల్లు అర్జున్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన డీ జే జగన్నాథం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం మలుపులూ గట్రా లేకుండా సాగిన చిత్రమే ఇది. అందుకే చూసిన వాళ్ళందరూ నవ్యత అంటూ ఏదీ లేని మరో వాణిజ్యపరమైన చిత్రమని చెప్తున్నారు. అది నిజమే కూడా.

ఈ చిత్రంలో కథా పరంగా అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ కుర్రాడుగా కేటరింగ్ బిజినెస్ చేస్తుంటాడు. మరోవైపు సమాజంలోని దుర్మార్గులను జయించాలని కూడా అనుకుంటూ ఉంటాడు. అందుకు తగ్గ పథకం వేసుకుంటాడు. అమలు చేస్తూ ఉంటాడు కూడా. ఆ పనులను డీ జే గా చేస్తుంటాడు. అతని అంకుల్ చంద్రమోహన్ ఓ సంస్థలో పెట్టిన డబ్బంతా కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటాడు. దానితో అల్లు అర్జున్ ఆ సంస్థ యజమాని రొయ్యల నాయుడుపై పోరాటానికి దిగుతాడు. ఈ క్రమంలో అల్లు అర్జున్ విలన్లను ఎలా గెలిచాడు అనేదే చిత్ర కథనం.

ఈ చిత్రంలో కథ ఎక్కడా ఊహాతీతంగా లేదు. తదుపరి ఏం జరుగుతుందన్నది ప్రేక్షకుడు సులభంగా ఊహించే రీతిలో ఉందని చెప్పుకోవచ్చు.

చిత్రంలో మాటలూ కొన్ని సన్నివేశాలూ బాగున్నాయి. ముఖ్యంగా విడిపోవాలనుకున్న వెన్నెల కిశోర్ దంపతులను కలిపే సన్నివేశంలో డైలాగులు బాగున్నాయి. అటువంటి సన్నివేశాలు మరికొన్ని ఉంది ఉంటె చిత్రం ఇంకా బాగుండేది. అయితే దర్శకుడు కేవలం వినోదానికే అధిక ప్రాధాన్యం చూపారు.

అల్లు అర్జున్ రెండు రకాల పాత్రలను చక్కగా నటించాడు. మంచి డాన్సర్ గా తనకున్న పేరును ఈచిత్రంలోనూ నిలుపుకున్నాడు అల్లు అర్జున్.

కథానాయిక పాత్రలో పూజా హెగ్డే నటించింది. ఆమె అందానికి గ్లామర్ మరింత తోడైంది.

రావు రమేష్ తన పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసాడు.
సుబ్బరాజు, వెన్నెల కిశోర్ హాస్యం బాగుంది.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ బాగున్నాయి.
అతనే ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించాడు. బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగుంది. సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంది. అల్లు అర్జున్ డైలాగులూ, నటనా చాలా బాగుంది.

Send a Comment

Your email address will not be published.