కొత్తదనం లేని శ్రీ శ్రీ

దాదాపు పదేళ్ళ నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న అలనాటి సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన శ్రీ శ్రీ చిత్రం విడుదలైంది. విజయనిర్మల, నరేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, సాయికుమార్ తదితరులు నటించిన శ్రీశ్రీ చిత్ర నిర్మాతలు శ్రీ సాయిదీప్ చాట్ల, బాలు రెడ్డి, షేక్ సిరాజ్. ముప్పలనేని శివ స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఈఎస్ మూర్తి సంగీతం అందించారు.

శ్రీపాద శ్రీనివాసరావు షార్ట్ కట్ లో చెప్పాలంటే శ్రీశ్రీ పాత్రలో కృష్ణ నటించారు. విశాఖపట్నంలో శ్రీశ్రీ గొప్ప పేరున్న ప్రొఫెసర్. అందునా లా ప్రొఫెసర్. అతని కూతురు శ్వేత ఓ టీవీ ఛానెల్లో ప్రోగ్రాం డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటుంది.

ఒక గిరిజన ప్రాంతాన్ని కాలుష్యమాయం చేస్తూ జనం ప్రాణాలతో ఆడుకునే ఓ సంస్థకు వ్యతిరేకంగా శేవత ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తుంది. దానితో అ సంస్థ కొడుకు, మరో ఇద్దరు కలిసి ఆమెను క్రూరంగా చంపేస్తారు. ఆ సమయంలో నిస్సహాయుడిగా ఉండిపోయిన శ్రీశ్రీ.. తన కూతురిని చంపిన వాళ్ల మీద న్యాయపోరాటం చేస్తాడు. అయితే శ్రీశ్రీకి న్యాయం జరగదు. అయితే కోర్టులో ఓటమి చవి చూసిన శ్రీశ్రీ తన కూతుర్ని చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాలి.

మహేష్ బాబు వాయిస్ ఓవర్ తోను, సుధీర్ బాబు క్యామియో రోల్ తోను, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రలు పాత్రలు చేయడంతోపాటు హీరోగా కృష్ణను మరోసారి చూడటం….ఇదంతా ఓ ఫ్యామిలీని ఒక చోట ఒక్కటిగా చూసామా అన్న అనుభూతి కలుగుతుంది. ఈ చిత్రంలో సుదీర్ఘంగా సాగే కోర్టు సన్నివేశాలు చూస్తుంటే పూర్వపు చిత్రాలలోని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి.

మేకప్ విషయంలో కృష్ణకు తగు జాగర్తలు తీసుకున్నా వయస్సు కారణంగా కృష్ణ హుషారుగా నటించలేకపోయారు అనే టాక్ వచ్చింది. నటనపరంగా చెప్పడానికి ఏమీ లేకుండాపోయింది. విజయనిర్మల నటన ఓకే. నరేష్ నటన ఓ మోస్తరుగా ఉంది.సాయికుమార్ విషయానికి వస్తే అతిగా నటించారా అనే అనుమానం కలుగుతుంది. కృష్ణ కూతురిగా నటించిన అమ్మాయి కూడా బాగా నటించలేదు. పోసాని పరవాలేదు.

పసలేని మాటలతో బోరు కొట్టించే చిత్రమిది. చూడకపోయినా నష్టం లేని చిత్రమే “శ్రీశ్రీ”

Send a Comment

Your email address will not be published.