కొత్త అవతారం

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. నటుడిగా ఇప్పటికే కోట్లాది మంది అభిమానుల స్టార్ గా వెలుగొందుతున్న పవన్ కళ్యాన్ నిర్మాతగా టాలీవుడ్ లో చోటు సంపాదించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

“ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్‌ వర్క్స్” బ్యానర్ మీద సినిమాలు నిర్మించడానికి ఆయన ఆలోచనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాన్ ముందుగా రామ్ చ‌ర‌ణ్‌తో ఒక సినిమా తీయానుకున్తున్నారు.

అలాగే యువ దర్శకులలోన దాగి ఉన్న  ప్రతిభను వెలికితీయడానికి కూడా తన పతాకం దోహదపడేలా ఉండాలనుకుంటున్నారు. అందుకోసమే పవన్ కళ్యాన్  చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగులు వెయ్యబోతున్నారు.

రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా చేసిన అనంతరం పవన్ మరికొందరు  హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తారు.

ఇప్పటికైతే ఆయన సంస్థ కథలపై తలమునకలైంది.  ఒక సారి కథ పక్కాగా ఖాయమైతే అప్పుడు ఆ చిత్రానికి హీరో ఎవరు, హీరో జోడీ ఎవరు… దర్శకుడు ఎవరు వంటి విషయాలన్నీ ఖాయమవుతాయని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

మరోవైపు, తన బాబాయి పవన్ కళ్యాన్ నిర్మిచే చిత్రంలో తానూ నటించబోయే అంశాన్ని రామ్ చరణ్ ధ్రువీకరించారు. తమ బాబాయి స్వయంగా ఒక సంస్థ  స్థాపించడం ఆనందంగా ఉందని కూడా రామ్ చరణ్ అన్నారు.

Send a Comment

Your email address will not be published.