కోపం వచ్చింది

ప్రఖ్యాత నటుడు, నిర్మాత మోహన్ బాబుకి కోపం వచ్చింది…

ఆయన ఈమధ్య ఒక కార్యక్రమానికి వచ్చినప్పుడు నిర్మాతల గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు మోహన్ బాబు కోపంగా జవాబిచ్చారు….

“చలనచిత్ర పరిశ్రమ ఎవరో ఒకరి సొత్తు కాదు. ఈ పరిశ్రమలోకి ఎవరైనా రావచ్చు. ఎవరైనా చిత్రాలు నిర్మించవచ్చు. దానినెవరూ కాదనరు. ఎవరి శక్తి వారిది. అంతే తప్ప ఈ పరిశ్రమ నాదనే ధోరణిలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అటువంటి వారు విజయం సాధించలేరు….

నేను ఎప్పుడైనా చిన్న నిర్మాతలకే మద్దతిస్తాను. ఈ పరిశ్రమలో చాలామంది తమను తాము బడా నిర్మాతలుగా చెప్పుకుని తీరా దిగిన తర్వాత పప్పులో కాలేస్తారు. భారీ మొత్తంలో డబ్బులు ఒక ఫైనాన్షియర్ నుంచి తీసుకుని సినిమా నిర్మాణం చేపడతారు. అక్కడి వరకు బాగానే ఉంటుంది….తీరా ఆ సినిమా విడుదలకొచ్చే సమయంలో సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులతో కిందా మీదా పడి ఫైనాన్షియర్ కు మొహం చాటేస్తారు. అలాంటి వారు నిర్మాతలు కారు. అలాంటి వారు నా దృష్టిలో లఫూట్లు.

మరోవైపు చిన్న నిర్మాతలు తమ సొంత డబ్బులు ఖర్చు చేసి సినిమా నిర్మిస్తారు. నిర్మించిన సినిమా విడుదల కోసం అంకితభావంతో శ్రమిస్తారు. అలాంటి వారు నిజమైన నిర్మాతలు.

ఈ పరిశ్రమలో ఎక్కడ ఏం జరుగుతోందో నాకంతా తెలుసు. కానీ నా బిజీ షెడ్యూల్ వల్ల మాట్లాడటం లేదు. సమయమొచ్చినప్పుడు జరుగుతున్ననిజానిజాలపై పెదవి విప్పుతాను. నిజం మాట్లాడటానికి నేనెప్పుడూ భయపడను” అని మోహన్ బాబు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.