క్రిష్ణగాడి వీర ప్రేమగాధ

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన “క్రిష్ణగాడి వీర ప్రేమగాధ” వినోదాత్మకంగా ఉన్నాది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం స్వరపరచిన “క్రిష్ణగాడి వీర ప్రేమగాధ” చిత్రంలో నాని, మెహరిన్, సంపత్ రాజ్, సత్యం రాజేష్, రామకృష్ణ తదితరులు నటించారు.

“ఎవడె సుబ్రహ్మణ్యం”, “భలే భలే మగాడివోయ్” వంటి సినిమాలు సాధించిపెట్టిన విజయాలతో మంచి ఊపులో ఉన్న నాని కథానాయకుడుగా వచ్చిన చిత్రమే “క్రిష్ణగాడి వీర ప్రేమగాధ”.

కృష్ణ పాత్రలో నాని నటించారు. అతను పరమపిసినారి. అతను ఓ ఫ్యాక్షన్ లీడర్ చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఫ్యాక్షన్ లీడర్ గా రామరాజు పాత్రలో శత్రు నటించారు. అతని చెల్లెలుగా మహా లక్ష్మి పాత్రలో మేహ్రీన్ నటించింది. ఆమెకు కూడా కృష్ణ అంటే ఇష్టమే. ఇష్టంగానే అతనిని ప్రేమిస్తుంది. కానీ రామరాజుకు భయపడి ఈ ఇద్దరూ తమ ప్రేమను తెలియకుండా ఉండటానికి బయటకు మాత్రం కొట్టుకుంటున్నట్టు నటిస్తారు. ఈలోగా ఫ్యాక్షన్ లీడర్ మహలక్ష్మి పెళ్లి ఖాయం చేయడాని చురుగ్గా ఏర్పాట్లు చేస్తాడు. ఆ విషయం తెలిసి పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని అనుకుని కృష్ణ తన ప్రేమ గురించి రామరాజుకి చెప్దామనుకుంటాడు. మరోవైపు ఫ్యాక్షన్ లీడర్ తనకో సహాయం చేస్తే తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇస్తాడు. అయితే ఫ్యాక్షన్ లీడర్ అడిగిన సహాయం ఏమిటి? కృష్ణ ఎలా సహాయం చేసాడు? ఫ్యాక్షన్ లీడర్ చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేదే కథ. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వెండితెరమీద క్రిష్ణగాడి వీర ప్రేమగాధ చూడాల్సిందే.

నాని కృష్ణ పాత్రలో జీవించాడు అని గట్టిగా చెప్పుకోవచ్చు. ఇందుకు ఆలోచించవలసిన అవసరం లేదు. అతని సరసన మెహరిన్ ముద్దుగా ముచ్చటగా నటించింది. పృధ్వీ, ప్రభాస్ శ్రీను, బ్రహ్మాజీ సన్నివేశాలు బాగున్నాయి.

విశాల్ చంద్రశేఖర్ స్వరపరచిన సంగీతంలో పాటలన్నీ పరవాలేదు.

Send a Comment

Your email address will not be published.