క్రేజీ కాంబినేషన్

నందమూరి తారక రామారావు – అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ – శోభన్ బాబు ఈ పేర్లు వింటేనే ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఆనాటి మేటి నటులంతా ఎలాంటి భేషజాలు లేకుండా పని చేయడం వల్లనే మాయా బజార్, గుండమ్మ కధ వంటి ఎన్నో కళా ఖండాలు అనదగ్గ అపురూప చిత్రాలు వెండితెరపై మనకు కనువిందు చేసాయి. ఆ తర్వాత తరం అయిన కృష్ణ – శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు వంటి అగ్ర హీరో లు కూడా తెలుగు చిత్ర సీమని అదే కోవలో రంజింపజేసారు.

అయితే అభిమానుల పంతాలు, పట్టింపులతో తెలుగు చిత్ర సీమ మల్టీ స్టార్ సినిమాలకు కొద్ది కాలం దూరమైంది. అయితే, విక్టరీ వెంకటేష్, ప్రిన్సు మహేష్ బాబుల కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తిరిగి మల్టీ స్టార్ సినిమాలకు ప్రాణం పోసింది.
వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా నటించిన ఆ సినిమా కి ప్రేక్షకులు బాగా ఆదరించడంతో నిర్మాతలు ఇప్పుడు మల్టీ స్టార్ సినిమా నిర్మాణానికి మొగ్గు చూపుతున్నారు.

వెంకటేష్, రామ్ కలిసి * మసాలా* సినిమాలో నటిస్తున్నారు. అంతే కాదు రామ్ చరణ్ , వెంకటేష్ లు కూడా కలిసి మరో సినిమా చేసేందుకు కధ సిద్ధం చేసుకున్నారట. ఫిలిం నగర్ లో ఈ సమాచారం లీక్ అయిన దగ్గర నుంచి అభిమానులు పండగ చేసుకొంటున్నారు.

Send a Comment

Your email address will not be published.