క్లాస్ కాని మాస్ చిత్రం

అల్లు అరవింద్ నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన సరైనోడు మాస్ చిత్రంలో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థ్రెసా, శ్రీకాంత్ , జయప్రకాష్, బ్రహ్మానందం, సురేఖా వాణి, అన్నపూర్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు వినిపించగా రత్నం మాటలు రాసారు.

గణ పాత్రలో నటించిన అల్లు అర్జున్ ది ఎల్లప్పుడూ గొడవలతో గడిపేసే క్యారక్టర్. ఆర్మీలో ఉద్యోగం చేస్తూ వచ్చిన గణ దానిని విడిచిపెట్టి వచ్చేస్తాడు. తనను కొడుకులా చూసుకునే లాయర్ బాబాయి దగ్గరకు వచ్చిన కేసులను గణ తన పంధాలో పరిష్కరిస్తూ ఉంటాడు. బాబాయి పాత్రలో శ్రీకాంత్ నటించారు.

మరోవైపు సీఎం కొడుకైన వైరం ధనుష్ మాఫియా రీతిలో తన వ్యాపారాన్ని సాగిస్తుంటాడు. దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు. ధనుష్ పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు.

అయితే తనకు పరిచయమైన ఇద్దరు అమ్మాయిల మూలంగా గణ ధనుష్ తో గొడవపడాల్సి వస్తుంది. గణ దీనితో ధనుష్ ఈగో దెబ్బతింటుంది. అతను గణపై పగ పెంచుకుంటాడు. ప్రతీకారం తీసుకోవాలని అనుకుంటాడు. కానీ గణ ధనుష్ ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు ? ఎలా గెలిచాడు? వంటివి తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాలి.

హీరో, విలన్ మధ్యే కథంతా నడపడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు బోయపాటి శ్రీను సరైనోడు చిత్రాన్ని కూడా దాదాపుగా అదే పంధాలో నడిపించారు. దానితో కథలో కొత్తదనం లేదనిపిస్తుంది ప్రేక్షకుడికి. కొన్ని సన్నివేశాలు రంజుగా సాగాయి. క్లాస్ ని కాకుండా మాస్ ని ఆకట్టుకున్న సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ రొమాన్స్ సన్నివేశాలు, ఉద్వేగాలు, వినోదం వంటి పాళ్ళు సరిగ్గా పడకపోవడంతో ఈ చ హిత్రం చూసే వారికి అల్లు అర్జున్ సినిమా చూస్తున్నామా అని అనిపిస్తుంది.

అల్లు అర్జున్ నుంచి మరింత నటన చూపించడంలో కాస్తంత విఫలయ్యారా అని అనిపించేలా చేసిన బోయపాటి శ్రీను కేథరిన్ థ్రెసాను కాస్తంత భిన్నంగా ఎమ్మెల్యే పాత్రలో చూపించారు.

బ్రహ్మానందం అక్కడక్కడా కొన్ని పంచులు వేయకపోలేదు.

క్లైమాక్స్ గొప్పగా లేదు.

తమన్ సంగీతం పరవాలేదు. ‘తెలుసా.. తెలుసా’ అనే పాట వినడానికి బాగుంది.

రత్నం దర్శకుడు బోయపాటి శ్రీనుకు తగినట్లే మాటలు రాసారు.

ఓవరాల్ గా చూస్తే సుమారుగా ఉన్న చిత్రం సరైనోడు. నూటికి ఓ నలభై మార్కులు వేయొచ్చు.

Send a Comment

Your email address will not be published.