ఖైదీ నెంబర్ 150

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా షూటింగ్ జోరుగాసాగుతోంది. ప్రస్తుతానికి ఈచిత్రానికి కత్తిలాంటోడు
అని టైటిల్ పెట్టారు. తమిళం కత్తి అనే పేరుతో ఈసినిమావచ్చింది. తమిళం విజయ్ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్ర కథనే తెలుగు నేటివిటీకి తగినట్టు కొన్ని మార్పులూచేర్పులూ చేసి తెలుగులో పునర్నిర్మిస్తున్నారు.

హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో షూటింగ్ జరుగుతోంది. మెగాస్టార్ జైల్లో ఖైదీ యూనిఫామ్ తో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి దర్శకుడు వీ వీవినాయక్. జైలు నుంచి చిరంజీవి తప్పించుకుని పారిపోయే సన్నివేశాన్ని చిత్రించారు. ఇక్కడ మెగాస్టార్ వేసుకున్న యూనిఫామ్ మీద యాదృచ్చికంగా 150 అని సంఖ్య ఉండటం గమనార్హం.

నిజానికి చాలా మంది అనుకున్నదేమిటంటే యూనిఫారంమీద 783 సంఖ్య ఉంటుందని. కానీ ఆయనకిది 150 వ చిత్రం కావడంతో ఆ సంఖ్యనే యూనిఫారంమీద ఉంచారు.

Send a Comment

Your email address will not be published.