గందరగోళంలో రాజ్ తరుణ్?

ఉయ్యాలా జంపాలా చిత్రంతోసహా మొదటి మూడు చిత్రాలూ హిట్లు కొట్టడంతో యువ నటుడు రాజ్ తరుణ్ అనేక చిత్రాలకు ఏకకాలంలో ఒప్పేసుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆయన గందరగోళంలో ఉన్నారు.

మొదటిసారిగా దర్శకత్వం చేపడుతున్న వెలిగొండ శ్రీనివాస్ చిత్రంలో నటించడానికి అంగీకరించిన రాజ్ తరుణ్ మరో రెండు చిత్రాలకు కూడా ఒప్పందం చేసుకున్నారు. వేల్గిందా – రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రాన్ని ఏ.కే. ఎంటర్ తిన్ మెంట్స్ సమర్పిస్తోంది.

ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలయ్యింది. అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాణ పనులు ఆగిపోయినట్టు తెలిసింది. ఈ చిత్రం ఆగిపోకుండా ముందుకు సాగడానికి వీలుగా దర్శకుడు వెలలిగొండకు సహకరించేందుకు ఓ మహిళా దర్శకురాలిని రంగంలో దించారు కూడా. అయితే ఆమె మొదటి రోజు షూటింగ్ తర్వాత తప్పుకున్నారు. ఇప్పుడు దర్శకుడు కూడా తప్పుకుని తన సొంత ప్రాంతానికి చేరుకున్నారు. దానితి నిర్మాతలు ఈ చిత్ర నిర్మాణ పనులు నిలిపివేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇలా ఇద్దరు దర్శకులు తప్పుకోవడంతో నిర్మాతలు ఏం చేయాలో తెలియక అయోమయంలోపడ్డారు.

మరోవైపు రాజ్ తరుణ్ కూడా సందిగ్దంలో ఉన్నారు. నిజానికి రాజ్ తరుణ్ ఓ చిత్రం పూర్తి చేసిన తర్వాత మరో చిత్రం చేయడానికి ఒప్పుకుని ఉంటే బాగుండేదని ఓ వర్గం అభిప్రాయపడింది.
వంశీ దర్శకత్వంలోని దొంగాట చిత్రం కూడా దాదాపుగా ఆగింది.

అలాగే సంజన రెడ్డి సారధ్యంలో మొదలైన మరో చిత్రం కూడా సగంలో ఉంది.

మరి రాజ్ తరుణ్ ఏం చేస్తారో చూడాలి?

Send a Comment

Your email address will not be published.