గబ్బర్ సింగ్ -2

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తాను గబ్బర్ సింగ్ -2 తో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఎప్పుడో ప్రకటించి అధికారికంగా ఆ చిత్రాన్ని ప్రారంభించడం కూడా తెలిసిందే. అయితే ఆ చిత్రం షూటింగ్ మాత్రం ఆరంభం కాలేదు. పవన్ కళ్యాన్ రాజకీయాల పని వల్ల, గోపాలా గోపాలా సినిమాతో బిజీ కావడం వల్ల గబ్బర్ సింగ్ – 2 చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా వచ్చే డిసెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు ఏర్పాట్లు చేసుకోమని పవన్ కళ్యాన్ దర్శకుడు సంపత్, నిర్మాత శరత్ మరార్ లతో చెప్పినట్టు సన్నిహిత వర్గాల భోగట్టా.

ఇక ఆ చిత్రంలో పవన్ సరసన నటించే హీరోయిన్ కోసం కూడా అన్వేషణ మొదలైంది. కథానాయిక కోసం ఎందరో పేర్లు చర్చకు వచ్చినప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ నే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఇటీవల ఆమె నటించిన చిత్రాలతో ప్రేక్షకులనే కాకుండా గబ్బర్ సింగ్ – 2 చిత్రం దర్శకుడిని, నిర్మాతను సైతం ఆకట్టుకున్నట్టు తెలిసింది. మరో వైపు ఆమె నటనకు పవన్ కళ్యాన్ కూడా మంచి మార్కులే వేసినట్టు తెలిసింది. కనుక గబ్బర్ సింగ్ – 2 లో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక పాత్రలో నటించే చాన్స్ ఉంది.

Send a Comment

Your email address will not be published.