గరంలో నా సంభాషణ

“నేను నా కెరీర్ ని ఎప్పుడూ ఫలానా లాగా ఉండాలని ప్రణాళిక రూపొందించుకోలేదు…..నన్ను కలిసి అడిగినప్పుడు వారు చెప్పేది విని సినిమాలో నటిస్తాను” అని ఆదా శర్మ చెప్పింది.

హార్ట్ అటాక్ చిత్రంతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన ఆదా శర్మ ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్తో కలిసి నటించింది.

ఇప్పుడు గరం అనే తాజా చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆదా శర్మ ముస్లిం అమ్మాయి పాత్ర పోషించింది. పాటల్లో తప్పించి ఈ చిత్రంలో చాలా వరకు ఆదా శర్మ బురఖా లోనే కనిపిస్తుంది ఆమె పాత్ర పేరు సమీర. ఆమె కళ్ళే ఆమె నటనకు అడ్డం పడతాయి. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో ఆమెకున్న డైలాగులు అయిదే అయిదు.

హార్ట్ అటాక్ చిత్రం చూసిన తర్వాత దర్శకుడు మదన్ ఆమెను ఈ చిత్రానికి ఎంపిక చేసారు. ఆ చిత్రంలో ఆమె నటనాభినయం మదన్ కు ఎంతగానో నచ్చింది. గరం చిత్రంలో తనకు ఏం కావాలో ఆ విధంగా సమీర పాత్రను చూపించారని ఆదా శర్మ చెప్పింది.

హార్ట్ అటాక్ చిత్రం తనకెంతో ప్రత్యేకమైన చిత్రమని, ఆ చిత్రం చూసిన తర్వాత తాను డ్యాన్స్ చెయ్యలేనని చాలా మంది అనుకున్నారని, అయితే ఆ తర్వాత డ్యాన్స్ షోస్ ఇచ్చినప్పుడు అవి చూసి తనకూ డ్యాన్స్ వచ్చునని తమ అభిప్రాయం మార్చుకున్నారని ఆదా శర్మ చెప్పిన డి.

బొంబాయి చిత్రంలో నటించిన మనీషా కోయిరాలా ను స్పూర్తిగా తీసుకుని తాను నటించానని, బొంబాయి చిత్రాన్ని తన చిన్న వయస్సులో చూశానని, మనీషా కోయిరాలా పాత్రను మణిరత్నం తీర్చిదిద్దిన తీరు అద్భుతమని ఆదా శర్మ అన్నాది. అప్పటి నుంచి తనకు అవకాశం అంటూ వస్తే ముస్లిం పాత్రలో నటించాలని అనుకున్నానని, ఆ ఆశ గరం చిత్రంతో తీరినట్టు ఆదా శర్మ తెలిపింది.

ప్రస్తుతం ఆమె క్షణం చిత్రంతో బిజీగా ఉంది.
ఆమెకు బాలీవుడ్ లోనూ అవకాశాలు వస్తున్నాయి. అయితే అవి ఖాయం అయ్యే వరకు తన ప్రాజెక్టులు చెప్పనని అన్నాది.

గరం చిత్రంలో ఆది నిజాయితీ గల నటుడని, ఎంతో శ్రమిస్తాడని ఆది నటనను కొనియాడిన ఆదా శర్మ టైం ఉన్నప్పుడు పెయింటింగ్స్ వేస్తుంది. తనకు ఏది అనిపిస్తే అది గీస్తానని, షూస్, బ్యాగ్స్, ఆ మాటకొస్తే ఏదైనా గీయాలనిపిస్తే గీస్తానని చెప్పింది.

Send a Comment

Your email address will not be published.