గరుడవేగ ఒకే

Garuda vegaశివాని శివాత్మిక ఫిలిమ్స్, జ్యో స్టార్ ఎంటర్ ప్రైజస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం పీఎస్వీ గరుడవేగ. ఎం . కోటేశ్వర రాజు నిర్మాత. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజశేఖర్, పూజ కుమార్, శ్రద్దాదాస్, కిషోర్, నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. ప్రవీణ్ సత్తార్, నిరంజన్ రామిరెడ్డి కలిసి రచన చేసిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో.

కథలోకి వెళ్తే ….
ఎన్ఐఏలో శేఖర్ పాత్రలో నటించిన రాజశేఖర్ ఓ ఆఫీసర్. అతని భార్యగా పూజకుమార్ నటించారు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే. ఇలా ఓ వైపు గొడవలు జరుగుతుంటే రాజశేఖర్ కు ఓ క్లిష్టమైన కేసు వ్యవహారం వస్తుంది. ఒక హ్యాకర్ పోలీసులకు సవాల్ విసిరుతూ ఎందరో ప్రాణాలు పోవడానికి కారణమవుతుంటాడు. అయితే ఈ హ్యాకర్ ఎవరు, అతనెందుకు ప్రాణాలు తీస్తున్నాడు, దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటీ వంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

ఈ చిత్రంలో పోలీసు అధికారి పాత్రలో నటించిన రాజశేఖర్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో బాగా నటించాడు. అతని సరసన నటించిన పూజా కుమార్ కు కథాపరంగా పెద్దగా స్కోప్ ఉన్న క్యారక్టర్ కాదు. ఉన్నంతలోనే ఆమె బాగానే నటించింది. కేసు విషయంలో రాజశేఖర్ బృందంలో నటించిన చరణ్ దీప, రవివర్మ తమ తమ పాత్రకు అన్ని విధాల న్యాయం చేశారు. రాజకీయ నాయకుడి పాత్రలో పోసాని కృష్ణ మురళి మరోసారి రాణించగా, అలీ, పృద్వీ మధ్య సన్నివేశాలు కొన్ని చోట్ల నవ్వించారు. విలన్ పాత్రలో కిషోర్ కూడా బాగానే నటించాడు.

దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమా కోసం చాలానే శ్రమించారు.

ఇలా ఉండగా, ఎంతో కాలంగా ఓ హిట్టు కోసం నిరీక్షిస్తున్న రాజశేఖర్‌తో ప్రవీణ్ సత్తారు చేసిన ప్రయోగం బాగానే కలిసొచ్చింది. ప్రథమార్థంలో రాజశేఖర్ నటన బాగుంది. అలాగే చిత్ర నిర్మాణంలోనూ విలువలు కనిపించాయి. అయితే ద్వితీయార్థం వచ్చేసరికి ఆహా ఓహా అని చెప్పడానికి వీల్లేకుండా పోయింది. మొత్తంమీదతీసుకుంటే రాజశేఖర్‌ కు మరో పునర్జన్మ గా చెప్పుకునే ఈ చిత్రాన్ని ఓ సారి చూడొచ్చు.

Send a Comment

Your email address will not be published.