గుర్తుండేది మంచి పనే

మనిషి బతికుండగానే కాదు చచ్చిపొయిన తర్వాత కూడా గొప్పవాడు అని అనిపించుకోవాలి అని ప్రముఖ హాస్య నటుడు కీర్తిశేషులు రాజబాబు చెప్పారొకసారి..

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వయసు వృద్ధాప్యాన్ని మనిషి మీదకు బలవంతంగా నెడుతుందని చెప్పిన రాజబాబు గారి జీవితంలో ఒక సంఘటన ఇది…

ఒకసారి జగపతి రాజేంద్రప్రసాద్ గారు రాజబాబుని పిలిచి అంతస్తులు సినిమాలో నరించే అవకాశం ఇచ్చారు. అప్పుడు రాజబాబు లోలోపల భయపడుతూనే “మరి నాకు వెయ్యి రూపాయలు ఇస్తారా?” అని అడిగారు.

అయితే రాజేంద్రప్రసాద్ రాజబాబుకి పదమూడు వందల రూపాయలు ఇచ్చారు. అందుకు రాజబాబు ఎంతో ఆనందించారు. అదే బోణీ. అంతే ఆ తర్వాత రాజబాబుకు వెనక్కి తిరిగి చూసుకునే టైం దొరకలేదు. అనంతరం ఆయన అనేక చిత్రాల్లో నటించారు.

రాజబాబుది ప్రేమపెళ్ళి. ఆయన లక్ష్మి అమ్మలుని ప్రేమించి  పెళ్లి చేసుకున్నారు. ఆమెను తన జీవితంలో ప్రవేశించిన దేవతగా ఆయన చెప్పుకునే వారు.

చిత్రరంగంలో ప్రవేశించిన 14 ఏళ్ళ లోనే ఆయన మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించారు.

ఆయన జీవితంలో ఏదో ఒక మంచి పని చెయ్యాలనే తలంపుతో తన పుట్టినరోజు నాడు పబ్లిక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పెద్దలను సన్మానించి మూడు రోజులపాటు నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేయించారు. ఆయన మొట్టమొదటగా చేసిన సన్మానం అప్పటి హాస్య నటుడు బాలకృష్ణకు.

ఆయనకు చేసిన ఈ సన్మానం గురించి మాట్లాడతూ, తాను  సినిమాకి రాకముందు పాతాళభైరవి తొంబై సార్లు చూశానని, అందులో బాలకృష్ణ గారి నటన తనను ఎంతో ఆకట్టుకుందని, ఆయన నటనే తనలోని నటుణ్ణి ప్రోత్సహించినట్టు చెప్పుకున్నారు. అందుకే బాలకృష్ణ అంటే తనకు ఎంతో గౌరవమని రాజబాబు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.