గొప్ప తండ్రి కూడా...

ప్రకాష్ రాజ్ ఒక గొప్ప నటుడు. భిన్నమైన పాత్రలు పోషింఛి ప్రేక్షకులను మెప్పించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ప్రతిభకు తిరుగులేదు. . ఏ పాత్రకా పాత్ర ఆయన కోసమే సృష్టించినట్టు అనిపిస్తుంది. ఆయన మాతృభాష కన్నడమైనా మరే భాషా చిత్రంలో నటించినా ఆయనే డైలాగులు చెప్పుకుంటారు. మరొకరితో డబ్బింగ్ చెప్పించుకోరు. ఏ భాష మాట్లాడినా అది ఆయన భాషే అన్నట్టు అనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ అమోఘం. అలాగే దర్శకత్వంలోను ఆయన తన పనితనాన్ని చూపిస్తున్నారు. కొన్ని సార్లు తప్పుడు కారణాల వల్ల అనవసరంగా వివాదాలకు గురయ్యే ప్రకాష్ రాజ్ మరో కోణం కూడా తెలుసుకోవడం అవసరం. ఆయన తన నిజ జీవితంలో గొప్ప తండ్రిగా తన పాత్ర పోషిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ కు ఇద్దరు అమ్మాయిలు.. వారి పేర్లు పూజా, మేఘన. ఈ ఇద్దరు కూతుళ్ళు ఆయనకు మాజీ భార్య, నటి లలితకుమారి వల్ల కలిగిన వారే. లలితకుమారితో వైవాహిక బంధం తెగిపోయినా ప్రకాష్ రాజ్ తన కూతుళ్ళకు అవసరమొచ్చినప్పుడల్లా తండ్రిగా తన వంతు బాధ్యత చెయ్యడంలో ఏ లోటూ చెయ్యడం లేదు.

తన పెద్ద కూతురు పూజ పైచదువుల కోసం ఆమెను తీసుకుని ఆయన ఇటీవల లండన్ వెళ్ళారు. అక్కడున్న విశ్వవిద్యాలయాలలో ఏది మంచిదో చెక్ చెయ్యడానికి ఆయన లండన్ వెళ్లి వచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగులో రాసుకున్నారు కూడా. జీవితయానాన్ని ఆయన గొప్పగా చెప్పుకున్నారు.

ఇలా ఉండగా లలితకుమారి మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ కు తమ ఇద్దరు కూతుళ్ళు అంటే చాల చాలా ఇష్టమని, వారి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవలసినప్పుడల్లా ఆయన అక్కడ ప్రత్యక్షమై వారిద్దరికీ ఏ లోటు జరగకుండా చూసుకుంటారని అన్నారు.

పూజా స్కూల్ చదువు పూర్తి చేసింది. ఆమె ఒక ఆర్టిస్టు. ఆమె ఫైన్ ఆర్ట్స్ లో చేరాలనుకుంటోంది. ఇందుకోసమే ప్రకాష్ రాజ్, పూజా లండన్ వెల్లోచ్చారని లలితకుమారి చెప్పారు.

Send a Comment

Your email address will not be published.