గోపాలా గోపాలా

కృష్ణుడిగా పవన్, భక్తుడిగా వెంకటేష్
—————————————————–

పీ కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న గోపాలా గోపాలా చిత్రం బాలీవుడ్ లో వచ్చిన ఓ మై గాడ్ సినిమాకు రీమేక్.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ తదితరులు  నటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నిర్ణీత సమయానికి షూటింగుకి రావడం లేదని కొన్ని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ స్క్రిప్టు విషయంలోను, పాత్ర విషయంలోనూ కొంత మార్పు చేసారని వినిపిస్తోంది.
మరోవైపు, ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారని, కృష్ణుడి పాత్రలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఆధునిక కృష్ణుడిగా కనిపించడానికి కృషి చేస్తున్నారని, అంతే తప్ప స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పు చేయలేదని అభిజ్ఞ వర్గాల భోగట్టా.
ఇదిలా ఉండగా దర్శకుడు కిశోర్ కుమార్ మాట్లాడుతూ స్క్రిప్టు విషయంలో ఎలాంటి మార్పులు లేవన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు దానికి మార్పులు కోరలేదని దర్శకుడు స్పష్టం చేసారు. తెరపై పవన్ కళ్యాణ్ 25 నిముషాలు కనిపిస్తారన్నారు. ఒరిజినల్ హిందీ సినిమాలో అక్షయ్ కుమార్ కృష్ణుడిగా నటించారని, ఆయన ఎంతసేపు హిందీలో భాషా చిత్రంలో కనిపించారో అంతసేపు పవన్ కళ్యాణ్ పాత్ర ఇటు తెలుగు రీమేక్ లోను కనిపిస్తుందని దర్శకుడు వివరించారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా నటిస్తుంటే విక్టరీ వెంకటేష్ కృష్ణ భక్తుడి పాత్ర పోషిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.