గోపీచంద్ "జిల్" జిల్లె..

గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ’జిల్’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో  గోపీచంద్ జోడీగా  రాశీఖన్నా నటించింది. ఈ చిత్రానికి  సంగీతం జిబ్రాన్. వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తన  గ్లామర్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరిస్తున్న చిత్రమిది.  ఈ చిత్రంలో మునుపెన్నడూ కనిపించనంత అందంగా, స్టయిలీష్ గా  గోపీచంద్ కనిపించాడు. .

రిచ్ నెస్ కి పెట్టింది పేరైన * యూవీ క్రియేషన్స్ సమర్పించిన ఈ చిత్రంలో  గోపిచంద్ ’జిల్’తో మరోసారి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటున్నాడు.

గోపీ టార్గెట్ యూత్ దృష్టిని తన వైపుకి తిప్పుకోవడంలో క్లిక్కయ్యాడు.  మరోవైపు కథానాయిక  కథానాయిక రాశీఖన్నా కూడా పూర్తి  గ్లామర్ తో నటించింది. ఆమె అందం సినిమాకే హైలెట్. జిబ్రాన్ సంగీతం వినసొంపుగానే ఉంది. పాటలకు మంచి స్పందన వచ్చింది.

కథలోకి వెళ్తే….

ఫైర్ ఆఫీసర్ గా గోపీచంద్ నటించగా ఆపదలో ఉన్నవారిని కాపాడటం కోసం ఎంతకైనా సహించేవాడు. ఈ క్రమంలోనే అతనికి  కథానాయిక రాశీఖన్నాను కలుసుకుంటాడు. ప్రేమలో పడతాడు. ముంబైలో మాఫియా డాన్ గా నటించిన  కబీర్ తన అనుచరుడిగా నటించిన  బ్రహ్మజీ దగ్గర మోసపోయి జైలు పాలవుతాడు.  జైల్లో నుంచి పారిపోయి వచ్చిన తర్వాత తనను మోసం చేసిన వ్యక్తి కోసం వెతుకుతాడు  ఇదే క్రమంలో కొన్ని సార్లు ఆపదలో చిక్కుకోగా అతనిని  హీరో కాపాడతాడు. ఒక భారీ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న  సమయంలో బ్రహ్మజీ హీరోకి ఓ  విషయం చెప్పాలనుకొని పూర్తిగా చెప్పలేడు. తాను వెతుకుతున్న విషయం హీరోకి  తెలిసిపోయిందన్న అనుమానంతో డాన్ అతని వెంటపడతాడు. ఇక ఆ తర్వాత హీరో అతనిని  ఎలా ఎదుర్కొన్నాడు, డాన్  దేనికోసం వెతుకుతున్నాడు, బ్రహ్మజీ చెప్పిన విషయాన్ని హీరో  ఎలా చేదిస్తాడు వంటివన్నీ తెలుసుకోవాలంటే వెండితెర పై చూడాల్సిందే.

Send a Comment

Your email address will not be published.