గోవిందుడు అందరివాడేలే ఆడియో...

పవన్ రాలేదు…. చిరు ప్రసంగానికి అడ్డు పడ్డ అభిమానులు

చిరు తనయుడు రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ఆడియో ఆవిష్కరణ
ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

అయితే ఈ కార్యకరమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రాలేదు. ఆయన రాలేదని తెలిసినా కూడా అభిమానులు పవన్ కళ్యాన్ అంటూ నినాదాలు చేసారు.

వేదిక పైకి చిరంజీవి వచ్చి తన ప్రసంగం మొదలుపెట్టడంతోనే అభిమానులు పవన్ కళ్యాణ్ పేరుతో నినాదాలు చేసారు. దాదాపుగా ఆయన ప్రసంగం సాగేంత వరకు ఈ గోల తగ్గ లేదు. దాదాపుగా అందరి ప్రసంగాలకి అడ్డు తగులుతూనే ఉన్నారు.

ఒక దశలో చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా 150 రోజుల వేడుకల్లో పవన్ తప్పకుండా పాల్గొంటాడని హామీ ఇవ్వాల్సి వచ్చింది.

చివరికి ఈ సినిమా దర్శకుడు కృష్ణ వంశీని కూడా అభిమానులు సరిగ్గా మాట్లాడనివ్వలేదు. ఆయన అభిమానుల నినాదాలకు తట్టుకోలేక మైక్ చరణ్ కి ఇచ్చేసారంటే అభిమానుల నినాదాల హోరు ఎంతో అర్ధం చేసుకోవచ్చు.

ఏది ఎలా ఉన్నప్పటికీ, ‘గోవిందుడు అందరివాడేలే’ ట్రైలర్ కానివ్వండి పాటల సందడి కానీ ఓహో అనిపించాయి. రామ్ చరణ్ కి ఇది మంచి పేరే తెచ్చిపెడుతుందని టాలీవుడ్ గట్టి నమ్మిక.

యువన్ శంకర్ రాజా స్వరపరచిన పాటలు ఇప్పటి ట్రెండ్ కి భిన్నంగా ఉన్నాయి. పాటలన్నీ చిత్రానికి తగ్గట్టు చక్కగా అమరాయి. ఈ చిత్రంలో ఒక్క మాస్ పాట కూడా లేదు. యువన్ తన తండ్రి ఇళయరాజా తీరులో ఈ పాటలన్నీ స్వరపరచినట్టు అనిపించింది.

తొలి ప్రతి దర్శకేంద్రుడికి అందించిన చిరు……

ఈ సినిమా సీడీ ని చిరంజీవి ఆవిష్కరించి మొదటి కాపీని ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావుకి అందించారు. తెరపై చరణ్ ని చూస్తుంటే తనను తానూ చూసుకున్నట్టు ఉందని, తనకు కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించాలని తనకు ఉండేదని, నటీనటుల నుంచి ప్రతిభను రాబట్టడంలో క్రిష్ణవంశికి ఉన్న శైలే వేరని చిరు చెప్పారు. తనకు విజేత సినిమా ఎలాంటిదో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చరణ్ కి మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

“ఇంతగా కస్తాపుడుతున్నావు కదా….” అని వాళ్ళ అమ్మ అంటే “నాన్న పడిన కష్టంతో పోల్చుకుంటే తన కష్టం ఓ కష్టమా” అని చరణ్ చెప్పే జవాబు విని తాను గర్వంగా ఫీల్ అవుతుంటాను అని చిరు చెప్పారు. ఈ చిత్రంలో నటించిన వారందరికీ, సాంకేతిక వర్గానికి చిరు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.