‘ఘాజీ’ - కనువిందే

The Ghazi Attackసముద్ర జలాల కింద పోరుగా చిత్రించిన ఈ ఘాజీ చిత్రాన్ని పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ప్రతి సన్నివేశమూ ఆసక్తి రేకెత్తించింది.

సంకల్ప్ కథ, స్క్రీన్ ప్లే తోపాటు దర్శకత్వం కూడా వహించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్, సత్యదేవ్, తాప్సి, ఓంపురి ప్రియదర్శి, నాజర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కే సంగీతం అందించారు. గుణ్ణం గంగరాజు మాటలు రాసారు.

భారత్, పాకిస్థాన్ మధ్య 1971లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంతో ప్రారంభమైన ఈ చిత్రంలో మన దేశాన్ని ఆరునూరైనా సరే దెబ్బతీయాలని పాకిస్తాను అనుకుంటుంది. ఆ కసితోనే మన దేశ నావికాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ దేశం ఘాజీ అనే సబ్ మెరైన్ ను రంగంలో దింపుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న మన దేశ నేవీ ఎస్-21 సబ్ మెరైన్ తో ప్రతిదాడికి పూనుకుంటుంది. ఈ సబ్ మెరైన్ కు కమాండర్ రణ్ విజయ్ సింగ్. కమాండర్ గా కేకే మీనన్ నటించారు. కానీ కమాండర్ ఆవేశపరుడు. అతనిని అదుపులో ఉంచడానికి నేవీ ఆదేశాల మేరకు సబ్ మెరైన్ పని చేసేలా చూసేందుకు అర్జున్ ని తోడు పంపుతారు. అర్జున్ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఈ క్రమంలో వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. విభేదాలతోనే ప్రత్యర్థులపై దాడి చేస్తారు. కానీ వీరి సబ్ మెరైన్ దెబ్బతిని ప్రమాదంలో పడుతుంది. అయినా ప్రమాదాన్ని అధిగమించి ఘాజీ దాడిని వీరు ఎలా ఆపగలిగారు, ప్రధానమైన ప్రాంతాన్ని ఎలా రక్షించారు వంటి విషయాలు తెలుసుకోవాలంటే చిత్రాన్ని వెండితెరపై చూడాలి.

కథను చక్కగా తెరకెక్కించిన తీరు అమోఘం అని చూసే వారి మాట. దర్శకుడు సంకల్ప్ ఈ కథను చివరి వరకూ పట్టుగా నడిపించాడు. వేరే భాషలకు చెందిన నటులు ఎక్కువమంది కనిపించిన ఈ చిత్రంలో ప్రధమార్థం రానా, కేకే మీనన్ ల మధ్య సంఘర్షణతో సాగుతుంది. ద్వితీయార్ధంలో యుద్ధ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి.

అక్కడక్కడా కొన్ని లోటుపాట్లు ఉన్నా మొత్తంమీద ఈ చిత్రం చూడదగ్గదే.

క్లైమాక్స్ విషయంలో మరికొంత శ్రద్ధ తీసుకోవలసింది. ఏదేమైనా కొత్తదనం కోసం తపించేవారికి ఈ చిత్రం ఓ విందే.

రానా నటన అద్భుతం. మిగిలిన నటీనటులు కూడా తమతమ పాత్రలకు తగు న్యాయం చేసారు. చక్కటి సమన్వయంతో చిక్కటి ఔట్ పుట్ తో కథను నడిపించిన దర్శకుడి ప్రతిభకు పాస్ మార్కులు వేయొచ్చు.

Send a Comment

Your email address will not be published.