చందూ దర్శకత్వంలో రవితేజ

Ravi Tejaదాదాపుగా ఏడాది నుంచి మిస్సవుతున్న హీరో రవితేజ ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కి సిద్ధమవుతున్నాడు.

ఇటీవల వచ్చిన ప్రేమం చిత్రం దర్శకుడు చందూ మొండేటి రవితేజ నటించబోయే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. నిజానికి ఇతర దర్శకులతో పని చేయాల్సి ఉన్న రవితేజ ఆ ప్రాజెక్టులను ఆఖరి క్షణంలో రద్దు చేసుకున్నాడు. అందుకు విభిన్న కారణాలు ఉన్నాయి. ఇప్పుడు రవితేజ చందూ తో కలిసిపని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

చందూ కథ చెప్పడంతోనే రవితేజ ముందు వెనుకలు చూడక ఆ కథలో ఓ పాత్రకావడానికి ఒప్పుకున్నట్టు అభిజ్ఞ వర్గాల భోగట్టా…

ఆ కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని త్వరగా పూర్తి చేయమని రవితేజ చందూతో చెప్పాడట.

ఇక ఎప్పుడైతే వీరి మధ్య మళ్ళీ కలయిక జరుగుతుందో ఆ మర్క్షణం షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

అయితే ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఇంకా నిర్ణయం కానప్పటికీ త్వరలోనే నిర్మాత పేరు ప్రకటించడం జరుగుతుందని అనుకుంటున్నారు.

ఇంత సుదీర్ఘ కాలంపాటు ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయకుండా ఉత్తినే ఉండటంతో కొందరు రవితేజను విమర్శించారు కూడా. కానీ రవితేజ మంచి కథతో తప్ప కెమెరా ముందుకు రాకూడదని ఓ కృత నిశ్చయానికి వచ్చినట్టు తెలిసింది.

చిట్టచివరకు ఇప్పుడు చందూ మంచి స్క్రిప్ట్ తో తన వద్దకు వచ్చారని రవితేజ చెప్పాడు.

గతంలో కార్తికేయ చిత్రానికి రూపమిచ్చిన దర్శకుడు అదే కోవలో ఈ కొత్త ప్రాజెక్ట్ ని నడిపించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

Send a Comment

Your email address will not be published.