చంద్రముఖిగా...

నటి కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో చంద్రముఖిగా కనిపించబోతోందా అంటే అవుననే అంటున్నాయి ఉత్తరాది సినీ వర్గాలు.

బాలీవుడ్ లో మరోసారి దేవదాస్ చిత్రం తీయడానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆ సినిమా గురించి అక్కడక్కడా కొన్ని మాటలు వినవచ్చాయి కూడా.

దర్శకుడు సుదీర్ మిశ్రా దేవదాస్ చిత్రాన్ని రీమెక్ చెయ్యడానికి ఎంతో ఇష్టంగా ఉన్నారు.

నవతరానికి తగినట్టు దేవదాస్ కథను ఆయన ఇప్పటికే మలిచినట్టు భోగట్టా. ఆ చిత్రంలో దేవదాస్, పార్వతిలుగా రాహుభాట్, రిచా చద్దానిని ఎంపిక చేసారు. అయితే ఇందులో చంద్రముఖి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని చిత్ర యూనిట్ కలిసినట్టు తెలియవచ్చింది.

కథ, పాత్ర నచ్చడంతో కాజల్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చిత్ర యూనిట్ తో తానూ నటించడానికి ఓకే చెప్పినట్టు తెలిసింది.

ఇప్పటివరకు బాలీవుడ్ లో దేవదాస్ కథాశైలిలో వచ్చిన చిత్రాలు మంచి విజయాలనే సాధించి పెట్టాయ ట. కనుక ఇప్పుడు దర్శకుడు సుదీర్ మిశ్రా రూపొందించే చిత్రం కూడా విజయం సాధిస్తుందని యూనిట్ నమ్మకం.

అలాగే కాజల్ అగర్వాల్ కు కూడా ఈ చిత్రం మంచి పేరు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నారు. ఈ చిత్రానికి ముందే కాజల్ మరో రెండు హిందీ సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది కూడా.

Send a Comment

Your email address will not be published.