చక్కటి చిత్రం "మనమంతా"

మళయాళ నటుడు మోహన్‌లాల్‌, గౌతమి, చేతన్‌, హర్షవర్ధన్‌, త‌దిత‌రులు నటించిన మనమంతా చిత్రం
చూడదగ్గ చిత్రమే.

చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మనమంతా చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. మహేష్‌శంకర్‌ సంగీతం స్వరపరిచారు.

నలుగురి నడుమ సాగే కుటుంబ కథా చిత్రం మనమంతా.

సాయిరామ్‌ పాత్రలోనటించిన మోహన్‌లాల్‌ ఓ చిన్నపాటి ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం మోహన్‌లాల్‌ సాగిస్తుంటాడు. వచ్చే జీతం జారిపోకుండా కుటుంబాన్ని అప్పులు చేస్తూ నడిపిస్తాడు. పిల్లల చదువులు, ఇంట్లో అయ్యే ఖర్చు చేయి దాటిపోతుంది. అయినా ఎలాగోలా కుటుంబాన్ని పోషిస్తుంటాడు.

ఈలోగా అతను పనిచేస్తున్న సంస్థ మేనేజర్ రిటైర్ అవుతాడు. అయితే ఆ మేనేజర్ పోస్ట్ తనకు వస్తుందని, అప్పుడు సుఖంగా సంతోషంగా గడపవచ్చని మోహన్‌లాల్‌ ఆశ పడతాడు. కానీ అదే సంస్థ లో తనకన్నా ఎక్కువ చదువు చదివిన విశ్వనాధ్ కూడా ఈ పోస్టు కోసం ట్రై చేస్తున్నాడని మోహన్‌లాల్‌ తెలుసుకుంటాడు. విశ్వనాధ్ పాత్రలో హర్షవర్ధన్ నటించారు. మేనేజర్ అయిపోవాలన్న ఏకైక లక్ష్యంతో మోహన్‌లాల్‌ ఎలాగైనాసరే ఆ పోస్ట్ నుండి విశ్వనాధ్ ను తప్పించాలని అనుకుంటాడు.

తనకు పోటీగా విశ్వనాధ్ ఉండకూడదనే ఆశయంతో మోహన్‌లాల్‌ ఒక రౌడీ గ్యాంగ్ ని విశ్వనాధ్ ను కిడ్నాప్ చేయమని చెప్తాడు. కానీ వ్యవహారంతోనే మోహన్‌లాల్‌ కష్టాల్లో పడతాడు. అయితే ఆ కష్టాల నుంచి మోహన్‌లాల్‌ బయటపడ్డాడా లేదా ? మేనేజర్ పోస్టు ఎవరికి దక్కింది వంటి వివరాలు తెలియాలంటే మనమంతా చిత్రం చూడాలి.

మధ్య మధ్యలో కథ కాస్త నెమ్మదిగా నడిచినా మొత్తం మీద కథనం, స్క్రీన్ ప్లే, మోహన్ లాల్ నటన బాగున్నాయి.

మోహన్‌లాల్‌ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన ఓ అంశం ఉంది. ఆయన కేవలం పది రోజుల్లోనే తెలుగు నేర్చుకుని తన డైలాగులు తానే చెప్పడం విశేషం.

మోహన్‌లాల్‌ భార్యగా గాయ్రతి పాత్రలో గౌతమీ చక్కగా నటించింది. హర్షవర్ధన్ , గొల్లపూడి మారుతీరావు, ఊర్వశి, అనీషా ఆంబ్రోస్‌, తమ తమ పాత్రలకు తగు న్యాయం చేశారు.

మహేష్ శంకర్ సంగీతం వీనులవిందుగా ఉంది.

ఎక్కడా విసుగు పుట్టించకుండా సాగిన ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడవచ్చు

Send a Comment

Your email address will not be published.