చప్పుడు లేని "డైనమైట్"

మంచు విష్ణు , ప్రణీత, జేడీ చక్రవర్తి , పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నటించిన “డైనమైట్'” విడుదల అయ్యింది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కథను అల్లగా బి.వి.ఎస్.రవి మాటలు రాశారు. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచు విష్ణు నిర్మాత.

తమిళంలో విజయవంతమైన ‘అరిమానంబి’ అనే చిత్రానికి ఈ తెలుగు చిత్రం రీ మేక్.

శివాజీ కృష్ణ పాత్రలో మంచు విష్ణు నటించారు. మంచు విష్ణు చదువు పూర్తి చేసుకున్న తర్వాత సొంతంగా పని చేసుకునే యువకుడు. అతనికి అనుకోకుండా కథానాయిక ప్రణీత పరిచయమవుతుంది. ఆమె ఓ గోప్పింది అమ్మాయి. ఆమెను ఓ ప్రమాదం నుంచి మంచు విష్ణు కాపాడుతాడు. దానితో ఆమె అతనితో డిన్నర్ కి వెళ్తుంది. అనంతరం ఇద్దరూ ఓ ఫ్లాట్ కి చేరుకుంటారు. ఇంతలో కొందరు రౌడీలు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆమెని కిడ్నాపర్ల చేర నుంచి కాపాడటానికి వారిని వెంబడిస్తాడు. కానీ ఆ సమయంలో కాపాడలేకపోతాడు. పోలీసుల దృష్టికి తీసుకుపోతాడు. కానీ లాభముండదు. ఇక ప్రయోజనం లేదనుకుని తానే రంగంలో దిగుతాడు. ఈ క్రమంలో ఎన్నో మలుపులు తిరుగుతుంది కథ. అయినా ఆమెను రౌడీలు ఎందుకు కిడ్నాప్ చేసారు? మంచు విష్ణు ఎలా కాపాడారు వంటి విషయాలు తెలుసుకోవడానికి సినిమా చూడాలి.

ఓహో అని అనుకోవడానికి వీలు లేని చిత్రం “డైనమైట్”.సస్పెన్స్ బాగానే పండించారు దర్శకుడు. కానీ వచ్చిన చిక్కల్లా కథనంలో పట్టు లేకపోవడం. పాటలు అంతంత మాత్రమే. సినిమా అనగానే కొన్ని పాటలు ఉండాలి కాబట్టి ఛిత్రీకరించినట్టు ఉందే తప్ప కథకు అతికేటట్టు లేదు.

విష్ణు కొత్త గెటప్ లో కనిపించారు. ప్రణీత నటన ఓ మోస్తరుగా ఉంది.

Send a Comment

Your email address will not be published.