చాందినీ...చాందినీ

ఆకర్షణీయమైన సౌందర్యం, కట్టిపడేసే చూపులు. ఇవి ఆమెకు ప్లస్ పాయింట్లు. ఇంతకూ ఆమెవరో చెప్పలేదుగా, ఆమె మరెవరో కాదు, పేరు చాందిని.
తమిళ తారే అయినా ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న నటి.
కాళీచరణ్ అనే తెలుగు చిత్రంలో నటించిన చాందిని ఎనబై దశకం బ్యాక్ డ్రాప్ గా జరిగిన కథ అది. అందులో చైతన్య కృష్ణ హీరో.  కాలేజీ చదువుతున్న బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో నటించిన ఆమెకు కాళీచరణ్ చిత్రంతో  మంచి గుర్తింపే లభించింది. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే కిరాక్ అనే సినిమాలో నటించే అవకాశమొచ్చింది. ఈ చిత్రంలో అనిరుద్ద్ అనే నూతన హీరో పరిచయమయ్యాడు. ఇందులో చాందిని ఆల్టా మోడరన్ అమ్మాయిగా నటించింది. అలాగే మరో రెండు తెలుగు సినిమాల్లో నటించే అవకాశమొచ్చింది. కన్నడంలోనూ ఓ ఆఫర్ వచ్చింది. అలాగే తమిళంలోనూ. ఈ రెండు చిత్రాల్లోనూ మంచి కథలే అయినా ఆ సినిమాలు తీయాలనుకున్న సంస్థలూ, సంబంధిత దర్శకులు చెప్పే వరకు వాటి వివరాలు తాను చెప్పలేనని చాందిని తెలిపింది.
మూన్డ్రాం పిరై శ్రీదేవి, మిన్సార కనవు కాజల్, మొయి జ్యోతికాలాంటి అవకాశాలు వస్తే పారితోషికం విషయం గురించి పట్టించుకోనని, మంచి పాత్రలు ముఖ్యమని చెప్తున్నచాందిని బాబా భక్తురాలు. . బాబా దయ వల్లే తనకు త్వరలోనే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందని అన్నది. ఏ మంచి పనైనా గురువారం రోజు ఆరంభిస్తానని, అలాగే తనకు ఏ మంచి జరిగినా అది గురువారం రోజే జరుగుతోందని చెప్పింది. తెలుగు రంగంలో అన్ని కమిట్ మెంట్స్ గురువారం రోజే జరిగాయన్నది.
వెండితేరలో అడుగు పెట్టే ముందు చాందిని మిస్ చెన్నై బ్యూటిఫుల్ ఫోటో జెనిక్ విజేతగా పలువురు దృష్టిని  ఆకట్టుకుంది.
తాను త్రిష చదువుకున్న స్కూల్, కాలేజీలోనే చదువుకున్నానని, సినీ రంగంలోనూ త్రిశాలా విజయం సాధించాలన్నది తన ఆశయమని చాందిని చెప్పింది. గ్లామర్ రోల్స్ లో నటించడం తనకు ఎంతో ఇస్టమని, అయితే తన పదకోశంలో గ్లామర్ అంటే అందం అని అర్ధమని, అంతేతప్ప మరొకటి కాదని ఆమె స్పష్టం చేసింది.

Send a Comment

Your email address will not be published.