చిక్కుల్లో బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కారణంగా నందమూరి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. టాలీవుడ్ లో దాదాపు మొదటి స్థానంలో హీరోగా ఉన్న బాలకృష్ణకు ఇప్పుడు తాజా రాజకీయాల కారణంగా మింగా లేని, కక్కా లేని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణాకు మద్దతిస్తూ చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ ఇచ్చారు. అయితే బాలకృష్ణ తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ రాష్ట్ర ఒక్కటిగా ఉండాలని కోరుకునేవారు. దాంతో బాలకృష్ణ ఇప్పుడు సందిగ్ధావస్థలో పడ్డారు. తండ్రి మాట ప్రకారం సమైక్యవాదిగా ఉండాలా లేక తన బావగారు, వియ్యంకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు మాట ప్రకారం రాష్ట్రాన్ని విభజనకు అంగీకరించాలా అన్నది ఆయన తేల్చుకోలేక పోతున్నారు.

ఎక్కడికి వెళ్ళినా విలేఖరులు తనను ఇదే విషయం మీద ప్రశ్నలు వేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా ఆయన రాష్ట్రంలో ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు, మున్ముందు తన చిత్రాలను సీమాంధ్ర ప్రాంతంలో ఎవరూ చూడరేమోనని ఆయన భయపడుతున్నారు.

Send a Comment

Your email address will not be published.