చిన్న చిత్రాలకు మహర్దశ

సీమాంధ్ర, తెలంగాణా ఆందోళనల పుణ్యమా అని రాష్ట్రంలో చిన్న సినిమాలకు కాలం కలిసి వస్తోంది. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా పెద్ద నటులు, భారీ బడ్జెట్ ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటోంది. కోటి, 50 లక్షల రూపాయలతో నిర్మించిన సినిమాలకు, అవి ఎంత ప్రాధాన్యం ఉన్న చిత్రాలయినా సరే, ధియేటర్లు ప్రదర్శనకు అవకాశం ఇచ్చేవి కావు. ముందుగా పెద్ద లేక భారీ చిత్రాలకు స్థానం ఇచ్చిన తరువాతే చిన్న చిత్రాలకు ధియేటర్లు ఆవకాశం ఇచ్చేవి. అయితే రాష్ట్రంలో రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆందోళనలు ప్రారంభం అయినప్పటి నుంచీ పెద్ద చిత్రాలు విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నాయి. దాంతో దియేటర్ల యాజమాన్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న చిత్రాలను విడుదల చేస్తున్నాయి.

గత జూలై నెల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలను వరసగా వాయిదా వేసుకుంటున్నాయి. సీమాంధ్ర ఆందోళనకు మద్దతుగా సినిమా నటులు మాట్లాడనందుకు చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ వంటి నటుల భారీ బడ్జెట్ చిత్రాలు డబ్బాల్లోనే ఆగిపోవాల్సి వచ్చింది. జూలై నుంచి వచ్చే డిసెంబర్ వరకూ వివిధ పెద్ద నటుల చిత్రాలు విడుదల కావాల్సి ఉంది కానీ, ఇప్పుడు విడుదల అయినట్లయితే, జనం తిరస్కరించే ప్రమాదం ఉందని హీరోలు భయపడుతున్నారు. అయితే చిన్న హీరోలకు అటువంటి భయమేమీ లేదు. వాళ్ళ చిత్రాలను జనం కూడా లెక్కలోకి తీసుకోవడం లేదు.

ఈ నెలాఖరులోగా ఆరు చిన్న చిత్రాలు పెద్ద ధియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఇందులో బారిష్టర్ సంకరనారాయన, ప్రేమకథ వంటి చిత్రాలు ఉన్నాయి. వీటి మొత్తం వ్యయం 20 కోట్ల రూపాయలు మించడం లేదు. కానీ దాదాపు 110 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కాకుండా నిలిచిపోయాయి. ఈ ఆందోళనలు ఈ ఏడాది చివరి వరకూ కొనసాగితే చిన్న హీరోలు ఈ రంగంలో నిలదోక్కుకోవచ్చని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తుండగా, తమ ఉనికికే ప్రమాదం వచ్చే ప్రమాదం ఉందని పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు

Send a Comment

Your email address will not be published.