మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని అప్పట్లో జోరుగానీ వార్తలు వచ్చాయి. అయితే అది కొన్ని రోజులకే ఆగిపోయింది. ఇంతకీ ఎందుకు పూరీ జగన్నాథ్ కథను తిప్పికొట్టారు అన్నది చూద్దాం.
పూరీ జగన్నాథ్ చెప్పిన కథలో మొదటి సగం వరకు ఎంతో బాగుందని చెప్పిన చిరు సెకండ్ ఆఫ్ స్టోరీ బాగులేదని చెప్పారు. పైగా ఈ మాటను ఆయన చెప్పినట్టు మీడియాలో వార్తలు రావడంతో పూరీ జగన్నాథ్ కాస్తంత నొచ్చుకున్నారు. కథ చెప్పిన తనతోనే సెకండ్ ఆఫ్ బాగులేదని మెగాస్టార్ చెప్పినట్టైతే బాగుండేదని, అలా చెప్పకుండా మీడియా ముందుకు వెళ్ళడం కాస్త ఇబ్బందిగా అనిపించిందని పూరీ అన్నారు.
అయినా ఇప్పటికీ చిరు 150వ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తనకు ఇస్తే ఆనందంగా చేపడతానని పూరీ అన్నారు.
‘ఆటో జానీ’ అనే సినిమా కథను పూరీ చెప్పినప్పుడు సెకండాఫ్ చిరంజీవి తనకు నచ్చలేదనే విషయం తిన్నగా చెప్పకుండా తన అభిప్రాయాన్ని తర్వాత చెప్తాను అన్నప్పుడే పూరీ పరిస్థితిని అర్ధం చేసుకోవలసింది. పైగా పూరీ తన తదుపరి ప్రాజెక్టులను వెల్లడించేసరికి వారి మధ్య గ్యాప్ చోటుచేసుకుంది.