చిరు ఇంట్లో మళ్ళీ పెళ్లి సందడి?

మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో మళ్ళీ పెళ్లి సందడి జరగబోతోంది. చిరంజీవి కుమార్తె శ్రీజ మళ్ళీ పెళ్లి చేసుకోబోతోంది. ఇది సన్నిహిత వర్గాల మాట.
చిరు కుటుంబం ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
శ్రీజ పెళ్లి అరెంజేడ్ మ్యారేజ్ అని అభిజ్ఞ వర్గాల భోగట్టా.
బహుశా ఈ పెళ్లి వచ్చే మార్చి నెలలో జరుగుతుందని తెలుస్తోంది.
శ్రీజ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి చిత్తూరుకు చెందినవాడని, వరుడు కుటుంబం కొంతకాలంగా చిరుకి తెలుసునని కూడా తెలిసింది.
శ్రీజ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సమ్మతించడం పట్ల చిరు సంతోషంగా ఉన్నారని ఆ వర్గాల మాట.
చిరంజీవి ఇంట్లోనే ఈ రెండు కుటుంబాలు కలిసి డిన్నర్ చేశాయని కూడా తెలిసింది.
పెళ్ళికి సంబంధించి అన్ని మాటలూ జరిగాయని కూడా తెలిసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మానుకుని ఈ ఫ్యామిలీ డిన్నర్ కి హాజరైనట్టు తెలిసింది.
తుని సంఘటనలపై మాట్లాడటం కోసం పవన్ కళ్యాన్ హైదరాబాద్ వచ్చి మీడియా తో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆయన నిజానికి చిరు ఇంట్లో జరిగిన శ్రీజ పెళ్లి మాటల కోసమే హైదరాబాద్ వచ్చి వెళ్లినట్టు కొన్ని వార్తలు చెబుతున్నాయి.

తాను లేకుండా శ్రీజ “పూర్వ పెళ్లి” అతి మామూలుగా జరగడంతో ఇప్పుడు శ్రీజ పెళ్లిని ఘనంగా జరిపే ఆలోచనలో చిరు ఉన్నట్టు తెలిసింది.

2007లో శ్రీజ శిరీష్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందో అని భయపడి అప్పట్లో ఆమె గుట్టుగా పెళ్లి చేసుకున్న సంగతి అది.
అయితే ఆ పెళ్లి బంధం ఎక్కువ కాలం సాగలేదు. శిరీష్ తనను వేధిస్తున్నాడని శ్రీజ విడాకులు కోరుకుంది. 2014 లో ఆమెకు విడాకులు లభించాయి. ఆ పెళ్ళితో శ్రీజకు ఒక కూతురు కూడా పుట్టింది. విడాకుల తర్వాత శ్రీజ ఇంటికి తిరిగి వచ్చేయడంతో అమ్మయ్య అనుకున్న మెగాస్టార్ ఇప్పుడు తన కూతురికి భారీ ఎత్తున పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ఈలోపు శ్రీజ లండన్ వెళ్లి అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.

Send a Comment

Your email address will not be published.