చిరు గురువుగా అమితాబ్

syeraa narasimha reddyసై రా నరసింహారెడ్డి చిత్రంలో బిగ్ బీ అమితాబ్ నటించబోతున్నట్టు వార్తలు వచ్చిన మాట నిజమే. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తారని అందరూ అనేక రకాల ఊహాగానాలు చేసారు.

అమితాబ్ చిరంజీవి గురువు పాత్రలో నటిస్తారని చివరికి ఖాయమైంది. చిత్ర కథనం ప్రకారం చిరంజీవి గురువు గోసాయి వెంకన్న. ఈ పాత్రలో అమితాబ్ కనిపిస్తారు. అమితాబ్ ప్రేరణతో వ్యూహంతో చిరంజీవి ఆంగ్లేయులపై తిరుగుబాటుకు సన్నద్ధమవుతాడు. చిరంజీవి గురువు పాత్ర ఈ చిత్రానికి ఎంతో ప్రధానమని, పైగా అమితాబ్ కున్న పేరుప్రఖ్యాతులు ఈ పాత్రకే కాకుండా చిత్రానికి ఎంతో కీలకమని చిత్ర యూనిట్ అభిప్రాయం. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రాం చరణ్ నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ చిత్ర్రానికి దర్శకుడు. కథానాయకిగా నయనతార నటిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.