చిరు చిత్రానికి దర్శకుడు ఎవరు?

మెగా స్టార్ చిరంజీవి నూట యాభయ్యో చిత్రానికి ఇంకా దర్శకుడు ఎవరో తేలలేదు.

ఆ మధ్య వీ వీ వినాయక్ చిరు 150వ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. వినాయక్ కూడా ఆ మేరకు ఒక ప్రకటన  చేసారు కూడా. . కానీ ఇప్పటికీ దర్శకుడు ఎవరో ఖరారు కాలేదన్నది తాజా వార్త. ఇప్పుడున్న సమాచారం బట్టి చిరంజీవి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. అయినా ఆ విషయం సైతం ఖరారు కావాల్సి ఉంది.

కొడుకు రామ్ చరణ్ నటించిన నాయక, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే చిత్రాలని చిరంజీవి స్వయంగా పర్యవేక్షించడం వల్ల సంపాదించిన అనుభవంతో ఆయనే తన 150 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తే సరిపోతుందిగా అనే టాక్ లేకపోలేదు. తన చిత్రానికి ఇప్పటికీ  సరైన స్క్రిప్ట్ కుదరకపోవడంతో చిరు తన సన్నిహితులతో ఈ విషయమై చర్చించి నట్టు తెలిసింది. అలాగే ఇప్పుడున్న అగ్రశ్రేణి దర్శకులలో ఏ ఒక్కరూ కూడా ఆయన 150 వ చిత్రాన్ని తగిన రీతిలో ముందుకు నడిపించలేరేమో అనే అభిప్రాయం చిరుకున్నట్టు తెలియవచ్చింది. కనుక అంతా అనుకున్నట్టు జరిగితే చిరంజీవి సమీప భవిష్యత్తులో నటనతోపాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.