చివరికి రోమియో వచ్చేస్తున్నాడు

పూరి జగన్నాధ్ సోదరుడు సాయి రామ్ శంకర్ ప్రధాన పాత్ర పోషించిన రోమియో చిత్రం వచ్చేస్తోంది. ఈ చిత్రంలో కథానాయిక ఆదోనిక. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో పూర్తయింది. రెండేళ్ళ క్రితం 2012 లోనే ఇది విడుదల కావలసింది. అయితే అనేక సార్లు అనేక కారణాలతో ఇది వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సంసిద్ధమయ్యారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కృత కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాధ్, ఎస్ వీ కృష్ణా రెడ్డి తదితరులు హాజరయ్యారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ తన చిత్రాలన్నీ హర్రర్ తో పాటు కాస్తంత భిన్నమైన చిత్రాలుగా ఉంటాయని, తాను మంచి ప్రేమ కథనో లేక రొమాంటిక్ కథనో తెర కెక్కించ లేనని అన్నారు. ఈలాంటి లవ్ స్టోరీస్ లో పూరీ జగన్నాధ్ సిద్ధ హస్తుడని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ తాను విదేశాలకు వెళ్ళినప్పుడు రోమియో, జూలియట్ జన్మ స్థలాన్ని సందర్శించానని, ఆ తర్వాతే ఈ రోమియో కథ రాసానని గుర్తు చేశారు. ఈ చిత్రంలో తన సోదరుడు నటించడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు.

ఈ స్క్రిప్ట్ తయారు చేసినందుకు సాయి రామ్ శంకర్ తన సోదరుడికి ధన్యవాదాలు చెప్పుకున్నారు.

Send a Comment

Your email address will not be published.