చీకటిరాజ్యంతో కమల్

సుదీర్ఘ కాలం అనంతరం క‌మ‌ల్ హాసన్ నేరుగా నటించిన చేసిన తెలుగు సినిమా “చీక‌టి రాజ్యం” ఇప్పుడు ప్రేక్షకుల ముందు ఉంది. త‌న దగ్గర చాలా ఏళ్ళుగా పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ రాజేష్‌.ఎం సెల్వ‌ను ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశారు కమల్.

కమల్ హాసన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ ఆఫీస‌ర్ గా దివాక‌ర్‌ పాత్రలో నటించిన ఈ చిత్రంలో చాలా నిజాయితీగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతని సిన్సియారిటీ తో సర్దుకుపోలేని భార్య డాక్ట‌ర్ సుజాత‌గా నటించిన ఆశ అత‌నికి విడాకులు ఇచ్చేస్తుంది. వీరి కొడుకు వాసు తండ్రి దగ్గరే ఉంటాడు.

అయితే కొడుకుకి తండ్రి మీద ఓ చిన్నపాటి సందేహం. తండ్రి తనను సరిగ్గా చూస్తాడా అని ఓ ప్రశ్న. ఈ క్రమంలో ఓ పధకంలో భాగంగా కమల్, తన మిత్రుడితో కలిసి ఓ డ్రగ్స్ ముఠాపై దాడి చేస్తాడు. డ్రగ్స్ స్వాఘీనం చేసుకుంటాడు. దీనితో డ‌గ్ర్స్‌తో వ్యాపారం చేసే ప్ర‌కాష్ రాజ్‌, కమల్ మీద ప్రతీకారం కోసం అతని కొడుకుని కిడ్నాప్ చేసి త‌నకు డ్ర‌గ్స్ తిరిగి ఇచ్చేస్తే కొడుకుని వ‌దిలేస్తానంటాడు. కమల్ తానూ స్వాధీనం చేసిన డ్ర‌గ్స్‌ ని గుట్టుగా దాచిపెట్టి ప్రకాష్ రాజ్ వద్దకు వెళ‌తాడు కమల్. అయితే అప్పుడు కమల్ అనుసరించిన వ్యూహం ఏమిటీ? అతనికి డ్ర‌గ్స్ ఎందుకు అవసరమైంది? అతని పధకానికి ఎవరు ప్రధానం? కొడుకుని కమల్ ప్రకాష్ రాజ్ గుప్పెట్లో నుంచి విడిపించుకున్నాడా తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే చీకటి రాజ్యం సినిమా చూడాలి.

మొదటి షాట్ నుంచి కడ దాకా కమల్ కనిపించే ఈ చిత్రంలో మొత్తం భారాన్ని తన మీదే వేసుకున్నారు. .

చక్కటి స్క్రీన్ ప్లే కు కమల్ చిక్కటి నటన తోడవడంతో సినిమా చూస్తున్నంత సేపూ థ్రిల్లింగ్ గానే అనిపిస్తుంది.

గ్లామర్ పాత్రలో కనిపించిన త్రిష నార్కోటిక్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ పోషించింది.

మ‌ధుశాలిని, కిషోర్ లతో పాటు సినిమాలో నటించిన వాళ్ళందరూ తమతమ పాత్రలకు తగిన న్యాయం చేసారు.

ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూర్చారు.

కానీ చిన్న లోపం ఒకటుంది. కథలో అసలు సూత్ర‌ధారి ఎవరనేది తెలియడంతోపాటు క్లయిమాక్స్ తప్పిస్తే మిగిలిన క‌థంతా సినిమా చూస్తున్న వాళ్ళ ఊహకు తగ్గట్టే సాగడమే ఓ చిన్నపాటి లోపం. దానితో సస్పెన్స్ అనేది లేకుండాపోయింది.

ఈ చిత్రంలో ఒకే ఒక్క పాట ఉంది. ఆ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా కమల్ పాడారు.

Send a Comment

Your email address will not be published.