చూడదగ్గదే - జనతా గ్యారేజ్

janata-garageసినిమా షూటింగ్ ప్రారంభమైన కొంత కాలం నుంచే అందరి దృష్టి జూనియర్ ఎన్ టీ ఆర్ జనతా గ్యారేజ్ చిత్రంపై చర్చలు మొదలయ్యాయి.

ఇప్పుడు అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం

నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, మోహన్ లాల్, నిత్యామీనన్, సమంత, సచిన్ కేడ్కర్…తదితరులు నటించారు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

సత్యం పాత్రలో నటించిన మోహన్ లాల్ ఒక మెకానిక్. అతను తన సోదరుడితోపాటు హైదరాబాద్ లో గ్యారేజ్ నడుపుతుంటాడు. అతని తమ్ముడి పాత్రలో రెహమాన్ నటించాడు. ఈ గ్యారేజ్ పేరే జనతా గ్యారేజ్. తమ దగ్గరకు వచ్చే వారి సమస్యలను పరిష్కరించడంలో ఈ గ్యారేజ్ కు మంచి పేరే ఉంది. అయితే కాలక్రమంలో అతనికి ప్రత్యర్ధులు తయారవుతారు. వారి దాడిలో సత్యం తన తమ్ముడిని కోల్పోతాడు. అతని కొడుకే ఆనంద్… ఈ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. అతనిని చిన్న వయస్సులోనే జనతా గ్యారేజ్ కి దూరంగా ఉంచడం కోసం ముంబైలో ఉంటున్న మేనమామ దగ్గరకు పంపుతాడు. మేనమామగా సురేష్ నటించారు.

అయితే ఆ మేనమామ ఆనంద్ కి ఓ కుటుంబం ఉన్నదీ అనే విషయం తెలియనివ్వకుండా పెంచుతాడు. ఆనంద్ ప్రకృతి ప్రియుడు. చిన్న చిన్న మొక్కల్ని సైతం ప్రేమిస్తాడు. ఈ విషయమై అనేకులతో గొడవపడతాడు కూడా. దీనితో అతనికి శత్రువుల సంఖ్యా పెరిగిపోతుంది.
అయితే అనుకోని కారణాలతో ఆనంద్ హైదరాబాద్ వస్తాడు. అక్కడ అతనికి సత్యం కలుస్తాడు.

ఇంతకూ వీరి కలయికకు కారణం ఏమిటి…. సత్యం తన పెద్ద నాన్న అనే విషయం ఆనంద్ కు తెలుసా? జనతా గ్యారేజ్ కి ఆనంద్ అవసరం ఎందుకొచ్చింది? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం. అనుకున్నట్టే తన నటనతో ప్రేక్షకులనను ఆకట్టుకున్నాడు అతని నటన సింప్లీ సూపర్బ్. .

ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా చక్కగా నటించాడు.

సమంత, నిత్యామీనన్ అందంగా కనిపించారు. అలాగని నటనలోనూ వీరు మంచి మార్కులే కొట్టేశారు. సాయి కుమార్, ఉన్ని ముకుందన్, సచిన్ ఖేడ్కర్, తదితరులు సైతం తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

దర్శకుడు కొరటాల శివ మంచి పాత్రలతో కథను పండించాడు.

దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది.

మొత్తంమీద చూడదగ్గ చిత్రమే జనతా గ్యారేజ్.

Send a Comment

Your email address will not be published.