చూడదగ్గ దృశ్యమే

చాలా కాలం తర్వాత వచ్చిన ఓ పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమే “దృశ్యం”.

మలయాళంలో అన్ని విధాల విజయవంతమైన దృశ్యం చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసారు. అచ్చంగా తెలుగుదనాన్ని పండించి వెండితెరకెక్కిన ఈ చిత్రంలో ప్రధాన జంట విక్టరీ వెంకటేష్, మీనా. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ సినిమాలో ఎవరికి వారు పోటీపడి నటించారు. అందరూ తమ తమ పాత్రలకు తగు  న్యాయం చేసారు.

వెంకటేష్ ఓ మధ్యతరగతి తండ్రిగా నటించారు. ఆయన పాత్ర పేరు రాంబాబు. కేబుల్ ఆపరేటర్ గా పని చేస్తుంటారు. సినిమాలంటే పిచ్చి. హాయిగానే సాగిపోతున్న ఆయన కుటుంబంలో అనుకోని రీతిలో ఓ సమస్య వచ్చిపడుతుంది. ఆ సమస్యను ఎలా అధిగమించారు అన్నదే ఈ చిత్రంలో కీలకమైనది. ఈ సినిమాలో రాంబాబు పాత్రకూ, తనకు  దగ్గరి పోలికలు ఉన్నాయని వెంకటేష్ చెప్పుకున్నారు.

మీనా, వెంకటేష్ కలిసి నటించిన ఐదో చిత్రమిది. పైగా పదహారేళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రమే దృశ్యం.

అనేక ట్విస్టులతో సాగిన ఈ కుటుంబ కథా చిత్రం సాకేంతికంగా కూడా ఓహో అనిపించుకుంది. అరకు, విజయనగరం తదితర ప్రాంతాలలోని చిత్రించిన కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.

ఏదేమైనా సకుటుంబంగా థియేటర్ కు వెళ్లి చూడదగ్గ మంచి చిత్రమే దృశ్యం. ఈ చిత్రానికి  శ్రీప్రియ దర్శకత్వం వహించారు.

 

Send a Comment

Your email address will not be published.